నగరం వెలుపల ఒక పాడుబడిన కోట లాంటి భవంతిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
కానీ ఆ నిశ్శబ్దం లోపల రణ్వీర్ సామ్రాట్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది.
జగ్గర్ మరియు బిర్లా ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో రణ్వీర్ ని చంపలేకపోయామన్న కోపం కంటే, వాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న అసూయ ఎక్కువగా కనిపిస్తోంది.
సరిగ్గా అప్పుడే మాఫియా కిల్లర్ ఖాల్సా నుంచి వాళ్ళకి కాల్ వచ్చింది.ఏంటయ్యా ఖాల్సా రణ్వీర్ వస్తున్నాడని తెలిసి పారిపోయావు.
ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వేడుకలు కూడా అయిపోయాయి. రేపు పెళ్లి.. ఇంకా నువ్వు ఏం చేయలేకపోతున్నావు అని జగ్గర్ కోపంగా అరిచాడు.
అవతలి నుంచి ఖాల్సా ఒక వింతైన, క్రూరమైన నవ్వు నవ్వాడు. జగ్గర్ గారూ రణ్వీర్ ని పెళ్లికి ముందే చంపితే ఆ బాధ ఒక రోజుతో ముగిసిపోతుంది.