దేవుడికి నమస్కారం చేసుకున్నాక, రణ్వీర్ కి అలసటగా ఉండటం గమనించిన దేవి గారు, రన్వీర్ ఉదయం నుండి పెళ్లి పనులతో చాలా అలసిపోయావు, వెళ్లి నీ గదిలో రెస్ట్ తీసుకో అని చెప్పారు.
రణ్వీర్ అన్విక వైపు ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
అప్పుడు అనిత అన్విక దగ్గరకు వచ్చి, వదినా నువ్వు కూడా ఈ బరువున్న పెళ్లి బట్టలతో ఇబ్బంది పడుతున్నావు కదా, రా నేను నీ గది చూపిస్తాను.
అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవ్వచ్చు అని అన్విక చేయి పట్టుకుని పై అంతస్తులోకి తీసుకువెళ్లింది. అన్విక ఆ బంగ్లాలోని వైభవాన్ని చూస్తూ,
తన జీవితం ఈ గోడల మధ్య ఎలా ఉండబోతోందో అని ఆలోచిస్తూ అనిత వెనుక అడుగులు వేసింది.పెళ్లి ముగిసిన మరుసటి రోజు ఉదయం, సామ్రాట్ ఎంపైర్ బంగ్లాలో ఒక కొత్త కళ సంతరించుకుంది.
సూర్యుడు తన లేత కిరణాలతో ఆ భారీ భవంతిని ముద్దాడుతుండగా, రణ్వీర్ తల్లి దేవి గారు ఉదయాన్నే లేచి ఇంటిని మంగళకరంగా తీర్చిదిద్దారు.