శ్రీనివాసరావు గారు అన్విక చేయి పట్టుకుని రణ్వీర్ చేతిలో పెడుతూ, రణ్వీర్ నా సర్వస్వం నీకు అప్పగిస్తున్నాను.
నా బిడ్డను కళ్లల్లో పెట్టుకుని చూసుకో అని విలపించారు. రణ్వీర్ గంభీరంగా ఆయన వైపు చూసి, మావయ్య అన్విక నా ప్రాణం.
ఆమెకు ఒక చిన్న ముల్లు తగిలినా ఈ రణ్వీర్ ఊరుకోడు. మీరు ప్రశాంతంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు.
అన్విక తన తల్లిని, తండ్రిని, నానమ్మని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ఇంటి నుండి బయటకు అడుగు వేసింది. రణ్వీర్ ఆమెను తన కారు వైపు నడిపించాడు.
కారు ఎక్కే ముందు రణ్వీర్ ఒక్కసారి నిశితంగా చుట్టూ చూశాడు. అక్కడక్కడ మాటు వేసి ఉన్న తన బాడీగార్డ్స్ కి కళ్లతోనే సిగ్నల్ ఇచ్చాడు.
పెళ్లి చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా ముగిసింది. కానీ రణ్వీర్ కి తెలుసు, ఈ ప్రశాంతత తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దం అని.