సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటింది. కాలేజీ క్లాసులు ముగిశాయి. అనిత, రాహుల్ తమ సెక్యూరిటీ గార్డ్స్‌తో కలిసి అన్విక కోసం గేటు దగ్గర వేచి చూస్తున్నారు.
అన్విక తన ఫ్రెండ్ శ్రావణితో కలిసి నవ్వుకుంటూ బయటకు వస్తోంది.
సరిగ్గా అదే సమయంలో, కళ్ళ నిండా కన్నీళ్లతో, చెదిరిన జుట్టుతో మాయ అక్కడ ప్రత్యక్షమైంది.
అన్విక ఆమెను చూడగానే ఒక్క క్షణం ఆగిపోయింది. ఆఫీసులో రణ్వీర్ ఆమెను కొట్టిన విషయం గుర్తుకొచ్చి అన్విక మనసు చివుక్కుమంది.
మాయ పరుగున వచ్చి అన్విక కాళ్ల మీద పడిపోయింది. అన్విక గారు.. నన్ను క్షమించండి.
నేను ఆవేశంలో ఏవేవో మాట్లాడాను. రణ్వీర్ సార్ నన్ను ఆఫీస్ నుంచి తీసేశారు, నాకు ఎక్కడా జాబ్ రాకుండా చేశారు.