అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నా, అన్విక గదిలో మాత్రం చీకటి అలుముకుంది. రణ్వీర్ పెట్టిన ఆంక్షలు, ఆ రోజు హాస్పిటల్‌లో కొట్టిన దెబ్బ అన్విక మనసును గాయపరిచాయి.
రోజులు గడుస్తున్నాయి.. వారం దాటింది.. పది రోజులు.. నెల రోజులు కావస్తోంది.
అన్విక ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. రణ్వీర్ గదిలోకి వస్తే కళ్ళు మూసుకుంటుంది, పక్కకు తప్పుకుంటుంది.
అతను తెచ్చిన నగలు, బట్టలు, ఖరీదైన బహుమతులు అన్నీ గది మూలన ధూళి పడుతున్నాయి.
రణ్వీర్ పరిస్థితి వర్ణనాతీతం. ఆఫీసులో అందరి మీద విరుచుకుపడుతున్నాడు, రాత్రుళ్లు నిద్రపోకుండా అన్విక గది బయట పచార్లు చేస్తున్నాడు.
ఒక మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే రానా, తన భార్య మౌనం ముందు మోకాళ్ల మీద పడిపోయాడు.