రణ్వీర్ ఆమె దగ్గరికి వెళ్ళగా ,ఆ కళ్లలో భయం ఉన్నా అంతకు మించిన ధైర్యం అతనికి కనిపించింది. అన్విక కూడా మొదటిసారి రణ్వీర్ను ఇంత దగ్గరగా చూసింది.
అతని ముఖంలో ఉన్న రాజసం, ఆ గంభీరత చూసి ఆమె ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయింది.థాంక్యూ నువ్వు నా ప్రాణాలు కాపాడావు అన్నాడు రణ్వీర్. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.
ఆ గొంతులో ఒక రకమైన కృతజ్ఞత ఉంది.అన్విక తేరుకుని, నువ్వు….నువ్వు కూడా నన్ను కాపాడావు కదా సో, వి ఆర్ ఈక్వల్ అని ఒక చిన్న నవ్వు నవ్వింది.
ఆ విపత్కర పరిస్థితిలో కూడా ఆమె నవ్వు చూసి రణ్వీర్ మనసులో ఏదో తెలియని చలనం కలిగింది.సిద్ధార్థ్ కారును రెడీ చేసి,సార్ ఇక్కడి నుంచి వెళ్లడం మంచిది అన్నాడు.
రణ్వీర్ అన్వికకు కారు తలుపు తీశాడు. అన్విక లోపల కూర్చుంది. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత కారు అన్విక ఇంటి ముందు ఆగింది.