నా చెలి -1 – 5
ధాత్రి చేత దిష్టి తీయించడం ఇష్టం లేకపోయినా కొడుకు ముందు గొడవ పడడం ఇష్టం లేక కిషోర్ గారిని కోపం గా చూస్తూ “ధాత్రి ఎర్ర నీళ్లు తీసుకురా “అని అరిచి చెప్తారు…
కిచెన్ డోర్ దగ్గర ఉండి రామ్ నీ చూస్తూ ఉన్న ధాత్రి కీ వాళ్ళ అత్తయ్య అరుపు డీజే సౌండ్ లాగా వినిపించి కంగారు గా ఎర్ర నీళ్లు తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది…..
ధాత్రి నీ చూస్తూ ” కొత్తగా మెయిడ్ నీ అపాయింట్ చేసావా మామ్ “అని అంటాడు రామ్….
రామ్ అలా అనగానే కిషోర్ గారు నందు షాక్ అయితే ధాత్రి బాధగా బయటికి వస్తూ ఉంటే దేవి గారు చాలా హ్యాపీ అవుతూ ” కాదు నాన్న మన బంధువుల అమ్మాయి ధాత్రి నీకు గుర్తు లేదా అయినా ఎప్పుడో చూసావు కదా ఎలా గుర్తుంటుందిలే “అని అంటారు……
” హ అవును మామ్ నాకు గుర్తులేదు సడన్గా చూసి పనిమనిషి అనుకున్నాను “అని మరోసారి అంటున్నా రామ్ నీ చూసి “పనిమనిషి లాగా కనిపిస్తుంద రామ్ నీకు అని విసుగ్గా అని ధాత్రి తల్లి తొందరగా దిష్టి తీయమ్మా ఇంకా ఇక్కడే ఉంటే మీ బావ కి ఇంకా దిష్టి ఎక్కువ అవుతుంది అప్పుడు మమ్మల్ని కూడా శని గ్రహాలు అంటాడు “అని అంటారు కిషోర్ గారు…
దేవి గారు కిషోర్ గారిని కోపం గా చూస్తూ ” అదేంటండి అలా అంటారు బాబుకి గుర్తులేదు తను ఎవరో అందుకే అలా అన్నాడు మీరేంటి అలా అంటున్నారు “అని అంటుంది…..
కిషోర్ గారు మాట్లాడకుండా ఉండేసరికి ” మామ్ డాడ్ కి కోపం వచ్చినట్టుంది వదిలేసేయ్, కాళ్లు నొప్పులు వస్తున్నాయి మామ్ తొందరగా “అని అంటాడు….
” అయ్యో సరే నాన్న “అని అంటూ ” ధాత్రి వినిపించలేదా తొందరగా దిష్టి తియ్యి నా కొడుకు కీ కాళ్లు నొప్పులు వస్తున్నాయి ఎంతసేపని నుంచో పెడతావ్ “అని కసురుతారు…..
ధాత్రి కంగారు పడుతూ దిష్టి తీసి బయటికి వెళ్తే రామ్ ని పట్టుకుని లోపలికి వస్తారు దేవి గారు……
“మామ్ నేను ఏమైనా పేషెంట్ నా అలా పట్టుకుని వస్తున్నావ్ “అని సోఫా లో కూర్చుంటూ అంటాడు రామ్……
” అలా కాదు నాన్న నిన్ను చూసి చాలా రోజులైంది కదా వదల బుద్ధి కావడం లేదు ఎంతైనా తల్లి ప్రేమ కథ నాన్న “……
” అవునవును మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది “అని అంటారు కిషోర్ గారు……
కిషోర్ గారిని చూసి ” ఏంటి డాడీ మీరు కొంచెం ఏదోలా మాట్లాడుతున్నారు ఏంటి “అని అంటాడు రామ్……
” నాకేమైంది ఏం అవలేదు “అని అంటున్న కిషోర్ గారిని చూసి ” నాన్న మీ డాడీ అంతే ఏదేదో మాట్లాడుతుంటారు నువ్వు అన్ని పట్టించుకోకు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా ప్రశాంతంగా ఉండు, వెల్లి ఫ్రెష్ అయి రా నాన్న టిఫిన్ చేద్దువు గాని “అని అంటారు దేవి గారు……
“హ సరే మామ్ “అని అంటూ ” నందు ఎక్కడ మళ్ళీ కనిపించలేదు “అని అడుగుతాడు……
” అది ఈ మధ్య నాకు చెప్పకుండా చాలానే చేస్తుంది వచ్చే రాగానే కిచెన్ లోకి వెళ్ళిపోయింది అక్కడ ఏం దాచిందో ఏంటో నేను పిలుస్తాను లే నాన్న నువ్వు వెళ్లి ఫ్రెష్ ఇవ్వు “……
“సరే మామ్ ముందు కాఫీ కావాలి కొంచెం పంపు “అని తన గదిలోకి వెళ్తాడు…..
రామ్ రూమ్ లోకి వెళ్ళగానే కిషోర్ గారి వైపు చూస్తూ ” ఏంటి మీరు ఎమ్ మాట్లాడుతున్నారు బాబు ముందు ఏదో పొరపాటున పనిమనిషి అనుకున్నాడు అంత దానికి అంత కోపం అవసరమా అయినా మీ మేనకోడలనీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది పని మనిషి లాగా వాడికి అనిపించడంలో పెద్ద వింత ఏముంది “అని అంటారు…….
” ఏంటి ధాత్రి నీ చూస్తే నీకు నీ కొడుక్కి పనిమనిషిలా కనిపిస్తుందా మీ ఇద్దరికీ సైట్ ఉండి ఉండాలి లేదంటే బంగారు బొమ్మ లాంటి ధాత్రి పని మనిషి లాగా కనిపిస్తుంద “…..
” ఇప్పుడా బంగారు బొమ్మ గురించి టాపిక్ అవసరమా అసలే నా కొడుకు కాఫీ అడిగాడు. మీరు మీ సోది ఆపేస్తే నేను వెళ్లి నా కొడుక్కి కాఫీ ఇస్తా “….
” నాకు నీతో మాట్లాడాలని ఏమీ లేదు కానీ వెళ్ళు ఇక్కడి నుండి “……
కిషోర్ గారిని చూస్తూ కిచెన్ లోకి వెళ్లి చూసేసరికి ధాత్రి సైలెంట్ గా పక్కన నిలబడి ఉంటే నందు దోస లు వేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది…..
ధాత్రి నీ చూడగానే కోపం వచ్చి విసురు గా దగ్గరికి వెళ్లి ” నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పక్కన నిలబడి నా కూతురు చేత దోసెలు వేయిస్తావ్ అంత మహారాణివి అయిపోయావా ఏమనుకుంటున్నావ్ నీ గురించి అసలు, నిన్ను నేను ఏదో తిట్టేస్తున్నాను అనుకుంటారు కానీ నువ్వు చేసే పనులు ఎవరికి కనిపించవు కదా “అని సీరియస్ గా అంటూ ఉంటారు……
ధాత్రి కంగారు గా ఎదో చెప్పేలోపు ” వదిన నువ్వు ఆగు ఎందుకు కంగారుపడుతున్నావ్ నేనే కదా వేస్తాను అని చెప్పాను “అని అంటూ ” చూడు మామ్ ఇక్కడ ఎవరు నా చేత పనులు చేయించడం లేదు నాకు నచ్చి నేను వేస్తాను అని చెప్పాను అంతే తప్ప వదిన తప్పు ఏమీ లేదు ఇందులో ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవ చేయకుండా నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళు “అని అంటుంది…
నందు అలా అనగానే ” నా కూతురికి నా మీద లేనిపోనివి చెప్పి నాకు యాంటీ అయ్యేలా చేస్తున్నావు కదా నిన్ను నేను ఊరికే వదలను ధాత్రి “అని ధాత్రి నీ పక్కకి లాగి కాఫీ కలుపుకొని రామ్ రూమ్ వైపు వెళ్తారు……
దేవి గారు బయటికి వెళ్ళగానే ” వదిన నువ్వు భయపడకు నువ్వు ఎప్పుడు అలా వనికి పోతూ ఉంటే మామ్ ఇంకా ఆడిస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు ధైర్యంగా ఉండమని, ఇప్పుడు ఏదో మాట్లాడి వెళ్ళింది అని నువ్వు కంగారు పడిపోకు సరేనా ” అని ధాత్రికి ధైర్యం చెబుతుంది నందు……
ధాత్రి కి నందు ధైర్యం చెప్పిన లో లోపల భయంగానే ఉంటుంది……
@@@@@@@@
ధాత్రి నీ తిట్టుకుంటూ రామ్ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి ఎక్కడ కనిపించడు…..
” ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు బాల్కనీలో ఏమైనా ఉన్నాడా ” అని బాల్కనీలో చూసిన ఎక్కడా కనిపించడు……
అప్పుడే వాష్ రూమ్ లో నుంచి బయటికి వస్తూ ” థాంక్స్ మామ్ కాఫీ తీసుకొచ్చావా “అని కప్ తీసుకోని తాగుతూ ” మామ్ నేను అడిగింది కోల్డ్ కాఫీ కాదు హాట్ కాఫీ ఇదేంటి ఇది తెచ్చావ్ “అని అడుగుతాడు…..
” కోల్డ్ కాఫీ కాదు నాన్న హాట్ కాఫీ నే ఏమైంది చల్లగా అయిపోయిందా “……
“హ అవును “…..
“అయ్యో సారీ నాన్న నువ్వు కనిపించలేదు అందుకే మొత్తం తిరిగి చూసేసరికి కాఫీ చల్లారిపోయింది ఇంకోటి తీసుకువస్తా “……
“ఇంకా ఇప్పుడు వద్దులే మామ్ టిఫిన్ తినేసిన తర్వాత తాగుతా ఓకే నా “……
“సరే నాన్న నువ్వు తొందరగా వచ్చేయ్ నేనే స్వయంగా నీకు టిఫిన్ వడ్డీస్తా “……
“సరే మామ్ “….
“సరే “అని దేవి గారు బయటికి వచ్చేస్తే రామ్ డ్రెస్ వేసుకుని ఒక పది నిముషాలు ఫోన్ మాట్లాడి కిందకి వస్తాడు……
రామ్ వచ్చి సోఫా లో కూర్చున్న కిషోర్ గారి దగ్గరికి వచ్చి “డాడ్ మామ్ ఎక్కడ “అని అంటాడు…..
“రేయ్ మామ్ మామ్ అని పదే పదే జపం చేస్తావ్ ఏంట్రా వస్తుందిలే ఎక్కడికి వెళ్తుంది రూమ్ లో ఉండి ఉంటుంది లేదంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది “అని విసుగ్గా అంటాడు……
“ఎందుకు డాడ్ అంత కోపం టిఫిన్ పెడతా అంది అందుకే అడిగాను “……
“నీకు మీ మామ్ పెడితేనే తిన్నట్టు ఉంటుందా ముందు పదా ఇక్కడ నుంచి “అని రామ్ చెయ్ పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడతాడు…..
“డాడ్ మామ్ నీ కూడా పిలుద్దాం “అని అంటుంటే “వస్తుంది అని చెప్పా కదా రామ్ నువ్వు తింటూ ఉండు ఫస్ట్ “అని కిచెన్ లో ఉన్న ధాత్రి నీ పిలుస్తాడు…..
కిషోర్ గారి పిలుపు విని “నందు మావయ్య పిలుస్తున్నారు ఇప్పుడే వస్తా “అని అంటుంది…..
“హ సరే వదిన “అని అనగానే ధాత్రి కిషోర్ గారు ఎందుకు పిలిచారో అని పరుగున బయటికి వస్తుంది……
డైనింగ్ టేబుల్ దగ్గర రామ్ నీ చూడగానే తన పరుగు ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ అత్తయ్య మాటలు గుర్తు చేసుకుని “నందు ఇక్కడ పని నేను చూసుకుంటా నువ్వు వెళ్లి మావయ్య ఎందుకు పిలిచారో అడుగు “అని కంగారు గా అంటుంది…..
“అదేంటి వదిన డాడ్ నిన్ను పిలిచారు నన్ను వెళ్ళమని అంటున్నావ్ “…..
“అంటే నందు మళ్ళీ అత్తయ్య వస్తే ఈసారి ఇంకా కోపం వస్తుంది ఎందుకు చెప్పు అందుకే నువ్వు వెళ్ళు ఈ ఒక్కసారి “……
ధాత్రి కంగారు చూసి “సరే వదిన నేనే వెళ్తా నువ్వు ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకో సరేనా “అని అంటుంది….
“హ్మ్మ్ థాంక్స్ నందు “….
“హ్మ్ సరే “అని నందు బయటికి వచ్చి “డాడ్ వదిన కిచెన్ క్లీన్ చేస్తుంది అందుకే నేను వచ్చా చెప్పండి ఎమ్ కావాలి “అని అంటుంది…..
“ఎమ్ లేదు రా మీ అన్నయ్య మామ్ మామ్ అని తెగ కలవరించేస్తున్నాడు వెళ్లి మీ మామ్ నీ పిలుచుకురా లేదంటే ఈ దోశలు కూడా తినలేడు కదా అందుకే ధాత్రి నీ పిలిచా అంతే “……
“సరే డాడ్ నేను పిలుస్తా మామ్ నీ “అని నందు రూమ్ వైపు వెళ్తే ” డాడ్ అందరం కలిసి తిందాం అని పిలిచాను అంతే మీరు జోక్స్ వేయకండి “అని తింటూ అంటాడు……
” నేను జోక్స్ వేయడం లేదు రా నువ్వు అన్నమాట కదా చెప్తున్నాను మాటికి ముందు మామ్ వెనుక మామ్ తగిలిస్తున్నవ్ మరి “అని చిరాగ్గా అంటూ బయటికి వస్తున్న దేవి గారిని చూసి మరింత చిరాగ్గా ఫేస్ పెడతారు కిషోర్ గారు…..
ఇంకా ఉంది…..
Swipe left/right or tap the sides to turn pages