ధాత్రి సైలెంట్ గా ” అలా ఏం కాదులే నందు అత్తయ్య కొంచెం కోపంగా ఉంటారు కదా అందుకే అలా ఉంటారు నాకేం బాధ లేదు నువ్వు ఇవి అన్ని వదిలేసేయ్ హ్యాపీగా చదువుకో “అని లోపలికి వెళ్తూ ఉంటారు……
“సరే వదిన నేను ఇప్పుడే వస్తా ” అని నందు తన రూమ్ లోకి వెళ్ళిపోతే అప్పుడే బయటకు వస్తున్న దేవి గారు ధాత్రిని చూసి “ఏయ్ ఆగు “అని గట్టిగా అరుస్తారు……
ధాత్రి అక్కడే ఆగిపోతే దేవి గారు ఎదురు గా వచ్చి ” నువ్వు ఎప్పుడు బయటికి వెళ్లావు అసలు ఇప్పుడు ఇంటికి వస్తున్నావా ఇంతసేపు ఎక్కడున్నావ్ ఎవరితో మాట్లాడుతూ బయట టైం వేస్ట్ చేసావ్, నీకేం చెప్పాను తొందరగా వచ్చి ఫుడ్ రెడీ చేయమని చెప్పాను కదా అయినా నా మాటంటే లెక్క లేకుండా బయట ఎవరితోనో సోది పెట్టుకుంటూ కూర్చున్నావా “అని అంటుంది……
ధాత్రి కంగారు పడుతూ ” కాదత్తయ్య చికెన్ షాప్ నుండి వస్తుంటే ఎవరో అబ్బాయిలు అడ్డుకున్నారు వాళ్ల నుండి తప్పించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది “అని అంటుంది……