రాక్షస ప్రేమ -16
“అవును కదా నేనే మర్చిపోయాను. నాన్న పేరు కార్తికేయ, అమ్మ పేరు కనకధారా నానమ్మ పేరు కంచు కనకమహాలక్ష్మి తమ్ముడు పేరు రౌద్ర అంతే కదా నువ్వు నాకు ఇంతకుముందు చెప్పింది” అని అడిగింది విరాజిత.
“అవును కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇలా అడుగుతున్నావు” అని అడిగాడు విరాట్.
“కార్తికేయ గారు అంటే ఈ కంపెనీ చైర్మన్ ఆయనే కదా మీ నాన్న” అని అడిగింది విరాజిత.
అప్పటికే మనసులో పూర్తి నిజం విరాజితకు తెలిసిపోయింది ఏమో అనే అనుమానంతోనే ఆమె వైపు చూస్తున్న వాడు, ఇప్పుడు డైరెక్ట్ గా ఆమె అలా నువ్వు చైర్మన్ కొడుకువా అని అడగటంతో ఒక్క క్షణం షాక్ అయ్యి ఆ తర్వాత మౌనంగా తలదించుకున్నాడు.
“ఏంటి అలా తలదించుకుంటున్నావ్ సమాధానం చెప్పు” అని గట్టిగా అడిగింది విరాజిత.