రాక్షసుడి నీడలో – 4
దాంతో బుక్ టేబుల్ మీద వేసి అతను సడన్ గా వెనక్కి తిరుగుతాడు. అతనికి దగ్గరకు వచ్చి నిలబడిన శివాని అతను సడన్ గా తిరిగే సరికి బాలన్స్ తప్పి ” ఆఆఆ…… ” అని గట్టిగ అరుస్తూ కింద పడబోతుంది.
వెనక్కి తిరిగిన అతను ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్న శివాని మణికట్టు పట్టుకొని గట్టిగ లాగుతాడు.
దాంతో వెనక్కి పడాల్సిన శివాని ముందు వున్నా అతని ఛాతి కి తగిలి ” అమ్మా…… ” అంటూ తల రుద్దుకుంటూ అతన్ని చూడగా అతను తన చేతిని వదిలి తన కంఠం పై చెయ్యి వేసి బుగ్గలు రెండు వత్తి పట్టుకొని ” ఇప్పుడు నువ్వు ఏం చేసావ్…” అంటూ కోపం గా అడుగుతాడు.
శివాని కూడా ఏమాత్రం తగ్గకుండా తను కూడా ” అసలు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావ్…పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు చదవకూడదు అనే కామన్ సెన్స్ లేదా…. ” అని అతని మీద గయ్యిమంటుంది.
‘ పర్సనల్ ‘ అన్న వర్డ్ విని అతని నొసులు ముడుచుకుంటాయి.
” వాట్… కం అగైన్…. నేను నీ పర్సనల్ విషయాలు చదివేనా…. ఎలా…. ” అంటూ అతని కోపం పెరగడం తో అతని గొంతు కొంచం గంభీరంగా మారుతుంది.
“అబ్బబ్బా……. రాముడు మంచి బాలుడు అమ్మా…. ఎలా చదివేనూ…. అని మళ్ళీ ఎలా అడుగుతున్నాడో చూడు…. నా కళ్ళతో నేను చూసాను…. నువ్వు నా పర్సనల్ విషయాలు రాసిన బుక్ చదువుతున్నావు కదా…. ” అంటూ మళ్ళీ వాదిస్తుంటుంది.
అతను ఆమె వైపు వింతగా చూస్తూ మళ్ళీ టేబుల్ పైన ఉన్న బుక్ వైపు చూసి దాన్ని చేతిలోకి తీసుకొని తన వైపు చూస్తూ ” ఇది నిజంగా నీ పర్సనల్ విషయాలు రాసుకునే బుక్ ఆ … ” అని గుచ్చి గుచ్చి అడుగుతాడు.
” అరే….. చెప్తే అర్ధం కదా నీకు… ” అతని చేతిలో బుక్ లాక్కుంటుంది. అతను ఆమె వైపు రిలాక్స్ గా చూస్తూ ” ఓపెన్ థాట్ బుక్ ” అంటూ ఆమె కంఠం పై ఉన్న అతని చేతి పట్టు సడలించి ఆమె తెచ్చిన షర్ట్ తీసుకోని వేసుకుంటాడు.
‘ నా బుక్ ఏంటో ఇతను చెప్తే చదవాలా….. ఉమ్మ్…. ఉమ్మ్….’ అని మనసులో అనుకొని మూతి ముప్పాయి వంకర్లు తిప్పి బుక్ ఓపెన్ చేసి చూడగానే నిలుక్కుపోతుంది.
అది తను ఇప్పుడు దాకా అనుకున్న బుక్ కాదు. బిజినెస్ మానేజ్మెంట్ సబ్జెక్టు మెటీరియల్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని సేమ్ అలాగే ఉండే నోట్స్ లో రాసుకుంది డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు.
ఇప్పుడు అదే నోట్స్ అతను తీసి ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అని చదువుతున్నాడు అని అర్ధం అవ్వడం తో ఇప్పుడు వరకు తను చేసిన పెర్ఫార్మన్స్ మొత్తం ఒక రీల్ వేసుకొని” అయిపొయింది…. ఇప్పుడు ఈ విషయం నాన్నకు తెలిస్తే ఇక అంతే సంగతులు…. అమ్మ అయితే కచ్చితంగా కొడుతుంది… ఇప్పుడు ఎలా……” అని ఆలోచిస్తున్న తను అతన్ని గమనించదు.
అతను షర్ట్ వేసుకొని వచ్చి ” పదా ” అంటూ అతను వెళ్లిపోతుంటే ఇక్కడ శివాని టెన్షన్ పడుతూ ‘ ఇప్పుడు ఇతను వెళ్లి నేను చేసింది చెప్పి పెళ్లి ఆపేస్తాడు ఏమో…. నాన్న ముందే చెప్పాడు… చాలా మంచి సంబంధం… వాళ్ళు ఆల్రెడీ చంద్రిక ను చూసి సంబంధం ఒప్పుకున్నారు….ఎక్కడ పొరపాటు జరగకూడదు అని….ఇప్పుడు ఎలా…” అని కంగారు గా అనుకుంటూ గబా గబా వెళ్లి డోర్ పూర్తిగా గా క్లోజ్ చేసి డోర్ కి అడ్డుగా నిలబడుతుంది.
అతను తనని మొహం చిట్లించి చూస్తూ వచ్చి డోర్ దగ్గర నిలబడి ‘ పక్కకి తప్పుకో ‘ అన్నట్టు చూస్తాడు.
దానికి తను తల అడ్డంగా ఊపుతూ ” ప్లీజ్ నేను చేసిన పనికి పెళ్లి కాన్సల్ చెయ్యకండి….మా అక్క నాలా కాదు…. చాలా మంచిది…. ప్లీజ్ నా వల్ల ఈ సంబంధం కాన్సల్ చెయ్యకండి ” అంటూ రిక్వెస్ట్ చేస్తుంది.
తను చెప్పేది విన్న అతనికి ముందుగా కోపం వచ్చిన తరువాత ఆలోచిస్తూ ” మీ అక్క మంచిది అంటున్నావు అంటే నువ్వు మంచిదానివి కదా ” అంటూ కొంచం దగ్గరికి వస్తాడు.
“ ఓయ్…… మాటలు మర్యాదగా రానివ్వు….నేను అంటుంది మా అక్క నెమ్మదస్తురాలు….. సౌమ్యంగా ఉంటుంది…. నాలా గట్టిగ మాట్లాడలేదు అని…. తప్పు తప్పు గా మాట్లాడేవో నాలుక కోసేస్తా….. ” అంటూ సడన్ గా రెబెల్ గా రియాక్ట్ అవుతుంది.
దానికి అతని పెదవుల అంచున కొంచం గా విచ్చుకుంటాయి. కానీ మళ్ళీ నార్మల్ గా అయిపోయి కోపం గా చూస్తూ బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చెయ్యబోతాడు.
దాంతో శివాని మళ్ళీ కంగారు పడుతూ ” ప్లీజ్ ప్లీజ్ సారీ అండి, కానీ మీరు తప్పుగా మాట్లాడారు కదా ” అంటూ రెండు చేతులు డోర్ కి అడ్డు పెట్టి మాట్లాడుతుండగా తన రెండు చేతులని ఒక్క చేత్తో పట్టుకొని తన తల పై లాక్ చేసి, తన నడుము చుట్టూ మరో చెయ్యి వేసి దగ్గరకి లాక్కొని శివాని రియాక్ట్ అయ్యేలోపు తన పెదవులు అందుకుంటాడు అతను.
శివాని…….?
హీరో పేరు రేపు రివల్ అవుతుంది. lag అనిపిస్తుంది ఏమో… బట్ ఈ సీన్ తోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది… సో , క్లారిటీ కోసం ప్రతిదీ వివరంగా రాస్తున్నాను. ☺️☺️☺️
కంటిన్యూస్……..!!!
Swipe left/right or tap the sides to turn pages