New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 14

రావమ్మా.. మహాలక్ష్మి – 14

గదిలోకి వెళ్లి అందంగా ముస్తాబు చేస్తుందే గానీ మహా దూరం అయిపోతుందన్న బాధ ప్రణతి కళ్ళల్లో సుళ్ళు తిరుగుతూనే ఉంది. 

 

మహా ప్రణతి బాధని అద్దం లోంచి చూస్తూనే… ప్రణతికే ఇంత బాధ ఉంటే విష్ణు… విష్ణు ఎంత బాధ పడుతున్నాడో.. అసలు ఎక్కడి కెళ్ళి పోయాడో.. పోనీ ఒకసారి కాల్ చేస్తే.. అప్పుడు ఏదో ఆశ కలిగిస్తానేమో.. ప్చ్.. అని నిట్టూర్చి,

 

పోనీ సుప్రజత్త మంచిగా మారిన బావుండు.. ష్.. వద్దు.. మళ్ళీ ఇదే జీవితం.. జీవితాంతం.. ఒక మార్పు లేకుండా.. వద్దులే.. వీళ్లిద్దరికీ కొన్ని రోజుల తరువాత బాధ పోతుంది.. ఈ బాధ కి కరిగిపోతే.. నేను అరిగిపోతాను.. అనుకుని..” ఇక చాలులే ప్రణతి.. ” అంది మహా. 

 

వాళ్ళొచ్ఛే టైం అవుతుంది మహా.. నేను ఇంటికి వెళ్లి ఏర్పాట్లు చూస్తాను.. అని వెళ్ళబోతు ఆగి, 

నాకెందుకో ఈ పెళ్లి చూపులు విష్ణు ఆపేస్తాడు అనిపిస్తుంది మహా.. ఒకవేళ ఆగిపోయాయి అనుకో.. నీ రియాక్షన్ ఏంటి?? అంది ప్రణతి. 

 

హ్మ్.. మంచి ఉద్యోగం చూసుకుని చేసుకుంటాను.. అంత కన్నా ఏముంటుంది.. ఈ ప్రశ్న నువ్వు సుప్రజ అత్త ని అడుగు.. సరైన సమాధానం దొరుకుతుంది.. అంది మహా. 

 

ప్రణతి అర్ధం కానట్టు చూసింది. నిజానికి ప్రణతి మాటలకు మహా ఒక్క క్షణం నిశ్చేష్టూరాలైపోయింది. విష్ణు ఆపేస్తాడన్న ఆ మాట మహా గుండెల్లో ఏదో తెలియని అలజడి రేకెత్తించింది. అయినా సరే, బయటికి మాత్రం తన గంభీరత్నాన్ని, నిబ్బరాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue