ఆ స్పీడ్ కి, ఊపుకి ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి “ధభాల్” అని కింద పడతారు.
కింద మధు మీద సుమిత్ పడతాడు, పక్కనే ఉన్న టేబుల్ ఫ్యాన్ వైర్లు ఊడిపోయి కింద పడుతుంది.
ఇద్దరూ కింద పడి మూలుగుతుంటారు… సుమిత్ కింద నుంచే మధు వైపు ఓరగా చూస్తాడు.
హబ్బా… నడుము విరిగిపోయింది మధూ !! ఎలా ఉంది రీల్ రొమాన్స్ ?? రీల్ లో అయితే వెనక పూల వాన పడుతుంది, ఇక్కడ మనకి ఫ్యాన్ కింద పడి దెబ్బలు తగిలాయి !! ఇదెక్కడి దిక్కుమాలిన రీల్ రా బాబోయ్ !! అంటాడు సుమిత్ నవ్వు ఆపుకుంటూ .