ఆదర్ష్ వెంటనే తనని మాల్ కి తీసుకెళ్లి కొన్ని డ్రెస్సెస్ కొన్నాడు….హోటల్ రూమ్ కి వెళ్లారు ఇద్దరు అప్పటికే అక్షిత బాడీ ని ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టి వచ్చేసారు….
అందువల్ల ఇద్దరు నార్మల్ గానే వచ్చారు…. రాగానే అంకిత ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుంది ఇంక ఇద్దరు ఇద్దరు పడుకున్నారు ఆదర్ష్ బెడ్ మీద పడుకుంటే అది చూసి మరి నేనెక్కడ… హ బెడ్ కింద అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు….
ఓరినాయనో వీడు ఏంటి రా బాబు ఇలా ఉన్నాడు పిచ్చెక్కిస్తున్నాడు అని తిట్టుకుంటూ సోఫా లో పడుకుంది…. అలా పడుకున్న ఇద్దరు ఎంత సేపు నిద్ర పోయారో కూడా వాళ్ళకే తెలియదు….
ముందు ఆదర్శ్ ఏ లేచాడు ఎదురుగా సోఫా లో ముడుక్కొని పడుకున్న అంకిత ని చూసి హ్మ్ ఇలా ఎదో కుక్క పిల్లల పడుకోపోతే దుప్పటి అడిగితె ఇస్తా కదా వణుకుతూ ఉండకపోతే అనుకోని దుప్పటి కప్పాడు….