విధి విడదీసిన స్నేహం 🥹 – 5
పాప పుట్టిన ఆనందం వల్లీ కళ్లలో కనిపిస్తుంటే…
వారసుడు పుట్టలేదనే నిరాశ ఆ ఇంటి వాళ్ల కళ్లలో కనిపిస్తోంది…
ఆస్తి కోసం మొదలైన ఆశలు…
వల్లీ జీవితాన్ని నెమ్మదిగా బంధించబోతున్నాయి…
చిన్నారి పుట్టి మూడు నెలలు అయ్యింది.
వల్లీ తన కూతురికి “రితిక(చిన్ని)” అని పేరు పెట్టుకుంది.
ఆ చిన్నారి నవ్వితే…
వల్లీ ప్రపంచం మొత్తం నవ్వినట్టే అనిపించేది.
పాప ఏడిస్తే…
తన గుండెనే ఎవరో పిండేస్తున్నట్టుండేది.
కానీ…
ఆ ఇంట్లో మిగతా వాళ్లకు మాత్రం చిన్ని మీద అంత ప్రేమ లేదు.
అది వల్లీకి రోజురోజుకీ అర్థమవుతోంది.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
ఒకరోజు…
వల్లీ వంటగదిలో పని చేస్తోంది.
చిన్ని ఉయ్యాలలో పడుకుని నవ్వుతోంది.
అత్తగారు (రతమ్మ) అక్కడికి వచ్చి పాప వైపు చూసింది.
“అమ్మాయిలు ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు.”
అంది.
వల్లీ చేతిలో ఉన్న గిన్నె ఒక్కసారిగా ఆగిపోయింది.
“అత్తయ్య…”
అని మెల్లగా పిలిచింది.
“ఏంటి?”
“అలా ఎందుకు అంటున్నారు?”
రతమ్మ మెల్లిగా నవ్వింది.
“నిజమే కదా.”
“ఈ ఇంటి పేరు నిలబడాలంటే మగపిల్లాడు కావాలి.”
“ఆస్తికి వారసుడు కావాలి.”
ఆ మాటలు విన్న వల్లీకి గుండెలో మంట మొదలైంది.
కానీ…
తిరిగి మాట్లాడే ధైర్యం చేయలేదు.
ఎందుకంటే…
తనకు అప్పటికే అర్థమైంది.
ఈ ఇంట్లో నిజం కన్నా సంప్రదాయం పెద్దది.
మనసు కన్నా ఆస్తి పెద్దది.
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
ఆ రోజు రాత్రి…
రాఘవ ఇంటికి వచ్చాడు.
వల్లీ ధైర్యం చేసి మాట్లాడాలని అనుకుంది.
“రాఘవ గారు…”
“హ్మ్?”
“మన పాపని అందరూ ఎందుకు అలా చూస్తున్నారు?”
రాఘవ ఫోన్ చూస్తూనే ఉన్నాడు.
“ఎలా?”
“అమ్మాయిగా పుట్టిందని…”
కొన్ని క్షణాలు మౌనం.
తర్వాత రాఘవ నెమ్మదిగా అన్నాడు.
“వాళ్ల ఆలోచనలు అలాంటివి.”
“నువ్వు పట్టించుకోకు.”
వల్లీకి కొంచెం ఊరట కలిగింది.
కానీ…
ఆ తర్వాత వచ్చిన మాట ఆమె ఆశలన్నీ ముక్కలు చేసింది.
“తర్వాత అయినా బాబు పుడతాడు.”
“మనం మళ్ళీ ప్రయత్నిదాం”
వల్లీ ఒక్కసారిగా అతని వైపు చూసింది.
“అంటే?”
“అంటే అదే…”
“ఇంట్లో వాళ్లు సంతోషపడతారు, నీకు సుఖం దొరుకుతుంది.”
ఆ క్షణం వల్లీకి అర్థమైంది.
రాఘవ కూడా వాళ్లలాగే ఆలోచిస్తున్నాడని.
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
ఆ రాత్రి…
మళ్ళీ వల్లీ రాఘవ ఒకటి అయ్యారు కానీ ఈసారి వల్లీ ఇష్టం తో కాదు…
రాఘవ కోసం వాళ్ల పంతం కోసం.
కొద్ది సేపటికి రాఘవ అలిసిపోయి నిద్రపోయాడు.
కానీ…
ఆమె చాలా సేపు నిద్రపోలేకపోయింది.
తన పక్కనే పడుకున్న చిన్ని ముఖం చూసింది.
“నువ్వు తక్కువ కాదు తల్లీ…”
అని మెల్లగా చెప్పింది.
“ఈ ప్రపంచమే నిన్ను అర్థం చేసుకోవాలి.”
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
కాలం గడిచింది.
చిన్ని ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఇంట్లో పుట్టినరోజు కూడా పెద్దగా చేయలేదు.
కానీ వల్లీ మాత్రం తన చేతులతో చిన్న కేక్ తయారు చేసింది.
ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించింది.
చిన్ని (రితిక) నవ్వుతూ చప్పట్లు కొట్టింది.
ఆ నవ్వు చూసి వల్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి.
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
అదే సమయంలో…
పుష్ప జీవితం కూడా ముందుకు సాగుతోంది.
ఇంటర్ పూర్తయింది.
డిగ్రీలో చేరింది.
ఆటల్లో రాష్ట్ర స్థాయిలో మెడల్స్ గెలుస్తోంది.
ఇంట్లో అందరూ గర్వపడుతున్నారు.
కానీ…
కొన్నిసార్లు పాత డైరీ తెరిచి చూస్తుంది.
అందులో వల్లీ గురించి రాసుకున్న పేజీలు కనిపిస్తాయి.
“ఎక్కడ ఉన్నావ్?”
అని అనిపిస్తుంది.
విధి మాత్రం ఇంకా ఇద్దరినీ కలపడానికి సిద్ధంగా లేదు.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
ఇదిలా ఉండగా…
వల్లీ మళ్లీ గర్భవతి అయింది.
ఆ వార్త తెలిసిన రోజు…
ఇంట్లో పండగ వాతావరణం వచ్చింది.
అత్తగారు దేవాలయాలకు వెళ్లింది.
మామయ్య ప్రత్యేక పూజలు చేయించాడు.
రాఘవ కూడా చాలా సంతోషంగా కనిపించాడు.
“ఈసారి మనకి బాబు వస్తాడు.”
అన్నాడు.
ఆ మాట విన్న వల్లీకి ఏదో తెలియని భయం వేసింది.
ఎందుకంటే…
ఈ బిడ్డ పుట్టకముందే వాళ్లు అతన్ని తమ సొంతం చేసుకున్నారు.
నెలలు గడిచాయి.
నెలలు నిండాయి.
డెలివరీ రోజు వచ్చింది.
మరోసారి…
అమ్మాయే పుట్టింది.
చాలా అందమైన పాప.
వల్లీ ఆనందంతో ఏడ్చింది.
కానీ…
బయట పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
అత్తగారు ఆసుపత్రి కారిడార్‌లో కూర్చుని ఏడుస్తోంది.
“మళ్లీ అమ్మాయేనా?”
ఆమె ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.
వల్లీ పేరెంట్స్ కూడా ఈసారి బాధపడ్డారు.
రాఘవ కూడా మౌనంగా నిలబడ్డాడు.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
ఆ రోజు మొదటిసారి…
వల్లీ మనసులో ఏదో తెలియని భావన
చెప్పాలంటే తన మనసు విరిగిపోయింది.
తన పిల్లల్ని ఎవ్వరూ హృదయపూర్వకంగా అంగీకరించడం లేదని ఆమె గ్రహించింది.
రెండో పాపకి “చిట్టి (రేణుక)” అని పేరు పెట్టింది.
చిన్ని (రితిక), చిట్టి (రేణుక)…
ఆ ఇద్దరే ఇప్పుడు వల్లీ ప్రపంచం.
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
ఇంకా రెండు సంవత్సరాలు గడిచాయి.
చిన్ని స్కూల్‌కి వెళ్తోంది.
చదువులో చాలా తెలివిగా ఉంది.
టీచర్లు కూడా మెచ్చుకుంటున్నారు.
కానీ…
ఇంట్లో మాత్రం ఇంకా ఒకటే మాట.
“మనవడు ఎప్పుడు?”
ఈ ప్రశ్న వల్లీని నెమ్మదిగా లోపల నుంచి చంపుతోంది.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
ఒకరోజు…
అత్తగారు నేరుగా చెప్పేసింది.
“ఈసారి కూడా అమ్మాయి పుడితే ఏం చేస్తామో మాకు తెలియదు.”
వల్లీ ఒక్కసారిగా భయపడింది.
“అత్తయ్య…”
“నేను నిజమే చెప్తున్నాను.”
“ఈ ఇంటికి వారసుడు కావాలి.”
ఆ మాటల్లో హెచ్చరిక ఉంది.
వల్లీకి అది స్పష్టంగా అర్థమైంది.
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
అదే సమయంలో…
రాఘవలో కూడా మార్పులు మొదలయ్యాయి.
ముందులా మాట్లాడటం లేదు.
ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నాడు.
ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
ఎవరితో మాట్లాడుతున్నాడో చెప్పడం లేదు.
పిల్లల ఆలనా పాలన మాత్రం చూడట్లేదు.
వల్లీ దగ్గరికి కూడా కేవలం దాని కోసం వరకే వచ్చి దగరికి తీసుకుంటున్నాడు.
నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో వల్లీ ఒక పనిమనిషి, ఒక వంటమనిషి, ఒక అవసరాలు (కోరిక) తీర్చే ఆడబొమ్మ, ఇంకొకరికి పిల్లల్ని కనే మెషిన్….
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
ఒకరోజు…
రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చాడు.
“ఎక్కడికి వెళ్లారు?”
అని వల్లీ అడిగింది.
“నీకు చెప్పాలా?”
అన్నాడు కోపంగా.
వల్లీ షాక్ అయింది.
ఇంతవరకు అతను అలా మాట్లాడలేదు.
“నేను అలా అడగలేదు…”
“అయితే నోరు మూసుకుని ఉండు.”
ఆ మాట వల్లీ గుండెలో బలంగా గుచ్చుకుంది.
ఆ తరువాత అతని అవసరం కూడా తీరింది.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
ఆ రోజు మొదలైంది అసలు మార్పు.
కొన్ని రోజుల తర్వాత…
వల్లీ బట్టలు ఉతుకుతోంది.
అప్పుడే రాఘవ షర్ట్ జేబులో ఒక బిల్లు కనిపించింది.
ఒక ఖరీదైన రెస్టారెంట్ బిల్లు.
ఇద్దరికి భోజనం చేసినట్లు ఉంది.
వల్లీ ఆశ్చర్యపోయింది.
ఎందుకంటే…
రాఘవ తనతో ఎప్పుడూ అలాంటి చోటికి వెళ్లలేదు.
“ఎవరివి ఇవి?”
అని అడిగింది.
రాఘవ ఒక్కసారిగా కోపంగా మారిపోయాడు.
“నా వస్తువులు ఎందుకు చూస్తావు?”
“నేను కేవలం…”
“నువ్వు నీ పని చూసుకో.”
అని గట్టిగా అరిచాడు.
చిన్ని, చిట్టి భయంతో తల్లి వెనకాల దాక్కున్నారు.
ఆ దృశ్యం చూసి వల్లీ గుండె ముక్కలైంది.
కానీ…
ఇది ఇంకా ప్రారంభమే.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
ఆ రాత్రి…
ఇద్దరి కలియిక జరుగుతున్నా వేల….
రాఘవకి ఫోన్ వచ్చింది.
మొదట పట్టించుకోలేదు కారణం తను ఆ సమయం లో వేరే వాటి మీద మగ్గు చూపాడు.
కానీ వరసగా మొగుతుండడంతో చుసిన అతను వెంటనే వల్లీ మీద నుండి లేచి టవల్ చుట్టుకొని ఫోన్ మాట్లాడసాగాడు…
వల్లికి అది ఆశర్యంగా అనిపించింది.
కానీ…
రాఘవ ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలు వల్లీకి వినిపించాయి.
“నిన్ను త్వరలో కలుస్తాను.”
“ఇక్కడ పరిస్థితులు సెట్ అవుతున్నాయి.”
“ఇంకొంచెం సమయం.”
అని చెబుతున్నాడు.
వల్లీ గుండె వేగంగా కొట్టుకుంది.
ఎవరు ఆ వ్యక్తి?
ఎందుకు రహస్యంగా మాట్లాడుతున్నాడు?
ఎందుకు తనతో మారిపోయాడు?
ప్రశ్నలు పెరుగుతున్నాయి.
కానీ సమాధానాలు దొరకడం లేదు.
తను పక్కన కొంచం దూరం లో పడుకున్న ఇద్దరి పిల్లల వైపు వెళ్ళబోయింది…
అప్పుడే రాఘవ వచ్చాడు.
“ఎక్కడికి”
అని అన్నాడు.
“అది పిల్లలు”
అని చెప్పే అంతలో…
“ఏం అవసరం లేదు వాళ్లు పడుకున్నారు నువ్వు రా”
అని వల్లీ ని లాకుపోయాడు.
మళ్ళీ వారి కలయిక ప్రారంభం అయింది….
ఈసారి వల్లీ బాధతో ఏడిచింది.
కానీ అది శరీరానికి తగులుతున్న బాధ కాదు మనసుకు తగులుతున్న బాధ!!
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
అదే సమయంలో…
వల్లీకి మరో శుభవార్త తెలిసింది.
ఆమె మళ్లీ గర్భవతి.
ఈ విషయం తెలిసిన వెంటనే…
ఇంట్లో వాళ్లందరి కళ్లలో మళ్లీ ఆశలు చిగురించాయి.
“ఈసారి ఖచ్చితంగా బాబే.”
“మన వారసుడు వస్తున్నాడు.”
“మన ఆస్తికి యజమాని వస్తున్నాడు.”
అని ఆనందపడిపోయారు.
కానీ…
వల్లీ గుండెల్లో మాత్రం ఆనందం లేదు.
ఎందుకంటే…
ఈ బిడ్డను వాళ్లు ప్రేమ కోసం ఎదురుచూడడం లేదు.
ఆస్తి కోసం ఎదురుచూస్తున్నారు.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
అదే సమయంలో…
రాఘవ ఫోన్‌లో మాట్లాడుతున్న ఆ రహస్య మహిళ ఎవరో తెలుసుకోవాలని వల్లీ నిర్ణయించుకుంది.
ఆ నిర్ణయం…
ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందని…
ఆమెకి ఇంకా తెలియదు.
కంటిన్యూస్…..
నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో:-
రాఘవ ప్రవర్తనలో వస్తున్న మార్పులు వల్లీని ఆలోచనలో పడేస్తున్నాయి…
అతని ఫోన్‌లో దాగి ఉన్న రహస్యం బయటపడబోతుందా?
అసలు రాఘవ మాట్లాడుతున్న ఆ మహిళ ఎవరు?
వల్లీ అనుమానం నిజమేనా… లేక ఇది మరో అపార్థమా?
వల్లీ జీవితంలో మొదలైన ఈ చీకటి… ఎక్కడికి దారి తీస్తుంది?
ఎలా అనిపించింది ఎపిసోడ్?? కామెంట్స్ లో తెలుపండి.
మీ కామెంట్స్ కాయిన్స్ అందిస్తారని ఆశిస్తూ……
ఇంకోసారి ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను…
-siri హన్విత ❤️
Swipe left/right or tap the sides to turn pages