రానా, నేను కూడా వెళ్లగలవా? అడిగాడు విక్కీ.
ఆహా, పర్వాలేదు అంటూ డోర్ దగ్గరికి వేసేసి, ఆమె పనులు అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి డోర్ ఓపెన్ చేసింది.
విక్కీ మళ్లీ తనని జాగ్రత్తగా తీసుకొని వచ్చి మంచం మీద పడుకోపెట్టాడు.
థాంక్యూ అంది వైదేహి.
“దెబ్బలు పడతాయి మరి నాకు థాంక్యూ చెప్తున్నావ్ ఏంటి?” అంటూ చిన్నగా కసిరి, “నేను డాక్టర్ని కనుక్కున్నాను. ఇందాక ఒక రెండు రోజులు ఆగి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. సో, ఎల్లుండి మనం ఇంటికి వెళ్ళిపోతాం” అన్నాడు విక్కీ.