అందని జాబిల్లి – 2
ఇరవై సంవత్సరాలు తర్వాత
” గ్రామ శివార్లలో, దట్టమైన చెట్ల మధ్య ఒక పురాతన కోట లాంటి భవనం గంభీరంగా నిలిచి ఉంది… “
శతాబ్దాల కాలం నాటి ఆ నల్లరాతి గోడలపై కాలం రాసిన సంతకంలా నాచు పేరుకుపోయింది… ఇరుకైన కిటికీల గుండా సూర్యకిరణాలు లోపలికి దూసుకొస్తుంటే, గాలిలో తేలుతున్న దుమ్ము కణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
లోపల భారీ సైజులో ఉన్న ఆ నిశ్శబ్ద హాలులో తను అడుగుపెట్టగానే, పాత తడి మట్టి వాసనతో కూడిన ఒక తెలియని ప్రశాంతత తనని ఆవరించింది
” ఆ తలుపుల పై చెక్కిన శిల్పాలు ఆనాటి కళాకారుల నైపుణ్యానికి అద్దం పడుతుంటే, శిథిలావస్థకు చేరుకున్న ఆ భవనం తన గత వైభవాన్ని మౌనంగా గుర్తు చేస్తున్నట్లు అనిపించింది”
” ఆ కాలపు నల్లరాతితో కట్టిన గోడలు… శతాబ్దాల కాలం నాటి ఎర్రటి ఇటుకలు… పాకురు పట్టిన, రంగు వెలసిన గోడలు గత వైభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి”
” ద్వారబంధాలపై చెక్కిన అద్భుతమైన శిల్పకళ… కిటికీలకు ఉన్న నగిషీల అద్దాలు… భవనం పైభాగంలో ఉన్న గంభీరమైన గుమ్మటాలు… ” అప్పటి వైభోగాన్ని కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి
ఆ భవనం చుట్టూ ఒక గంభీరమైన నిశ్శబ్దం ఆవరించి ఉన్నా…. లోపలికి అడుగు పెట్టేసరికి మాత్రం ఒక ఆత్మీయ భావన ప్రశాంతత మన మనసుకు తెలుస్తుంది
” అది కేవలం ఒక కట్టడం కాదు, కాలం నిలిచిపోయిన ఒక చరిత్ర పుట “
” ప్రతి మూలలోనూ ఏదో ఒక రహస్యం దాగున్నట్లు అనిపిస్తుంది “
” తను అడుగులు వేస్తుంటే ఆ విశాలమైన హాలులో ప్రతిధ్వనించే శబ్దం… గాలికి కిర్రుమనే పాత చెక్క తలుపులు… ఆమెలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి
” పాత కాగితాలు, తడి మట్టి, మరియు కాలం నలిగిన పురాతన వస్తువుల మిశ్రమ వాసన ” ఆమె నాసికానికి తగలగానే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మైమర్చిపోయింది
నాచు పట్టిన చల్లని రాతి గోడలను చూస్తుంటే అది కొన్ని సంవత్సరాలది కాదు శతాబ్దాల క్రితం రాజభవనం అని ఇట్టే తెలిసిపోతుంది
ఆ భవనంలో ఏటు చూసిన ఏవో గుర్తులు ఏవో సంకేతాలు ప్రతి చోట తనే ఉన్నట్లుగా మనసుకి సంకేతాలు తెలుపుతుంటే ఎటు వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో హాల్లోనే ఒక దగ్గర ఉండిపోయిన ఆమె చేయి పట్టుకొని ఎవరో లాగుతారు
అప్పటికే ఆమె మనసు నిండా భయం నిండిపోయి ఉండటం వల్ల ఒక మనిషి స్పర్శ తగలగానే ” ఆ ” అని గట్టిగా అరుస్తుంది ఆ పట్టుకున్న చేతిని వదిలించుకుంటూ
కానీ అంతకంతకు ఆ పట్టు బిగిసుకుంటుంటే ఈసారి అరుస్తూనే ఆ చేతిని గోర్లతో గిచ్చడం మొదలు పెడుతుంది
ఒసేయ్ ఒసేయ్ నీకేం వచ్చింది ఇంతలా గీచేస్తున్నావ్… నువ్వు మనిషివేనా లేక రాక్షసివ అని గట్టిగా వినిపించిన అరుపుకి తాను చేస్తున్న ప్రయత్నం ఆపేసి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది
అప్పుడు గాని తెలియలేదు ఇప్పటి వరకు తన మైండ్ లో తిరిగింది అంతా ఒక ” కల ” అని…. దేవి ఇలాంటి కలను తీసుకువచ్చావేంటి తల్లి ఏం చెప్పబోతున్నావు నువ్వు నాకు అని ఆలోచిస్తూ ఎదురుగా చూసేసరికి తను గీరిన రక్కులను చూపిస్తూ తన పాటికి తను తిట్టుకుంటున్న వాళ్ళ బామ్మ కనిపిస్తుంది
ఆ కల గురించి తర్వాత ఆలోచించొచ్చు ముందు ఈ దేవిని శాంతిపరచాలి లేకపోతే ఈరోజు అంతా ఈ తిట్ల దండకంతో నన్ను తినేస్తుంది అని మనసులో అనుకుంటూ
శుభోదయం బామ్మ !! ఏంటి ఇంత ఉదయాన్నే నా దగ్గరికి వచ్చావు మీ అమ్మగారు నిన్ను ఇంకా పిలవలేదా అని అడుగుతుంది నవ్వుతూ
పిలవడం అయింది నేను వెళ్లి రావడం అయింది పొద్దెక్కేవరకు పడుకొని శుభోదయం చెప్పే అమ్మాయిని నిన్నే చూస్తున్నాను అని కోపంగా అంటారు రమణి గారు
అవునా అని అంటూ పక్కన గడియారం చూసేసరికి ఐదు గంటలు చూపిస్తుంటే… అమో అప్పుడే ఇంత టైం అయిపోయిందా నా దేవికి ఆకలి వేస్తూ ఉండి ఉంటుంది తొందరగా వెళ్ళాలి నువ్వు వెళ్లి ఆ పని చూడు అని చెప్తూనే డ్రెస్ తీసుకొని వాష్ రూమ్ లోకి పరిగెడుతుంది
ఏంటో ఈ పిల్ల లేపే వరకు లేవదు లేచిన తర్వాత ఆగదు అని గొణుగుతూ బయటికి రాగానే…. రమణి మోక్ష ( మోక్ష దేవి ) లేచిందా ఏమంటుంది ఇంత చిరుబుర్లు ఆడుతున్నావు నా మనవరాలు మీద అని నవ్వుతూ అడుగుతారు శ్రీ హయగ్రీవ శర్మ గారు ( పంతులు గారు )
రోజు ఉన్నదే కదా కొత్తగా ఏమీ లేదు… రోజు రోజుకి మీ మనవరాలు దెయ్యంలా మారుతుంది అని అంటూ మోక్ష రక్కిన రక్కులను చూపిస్తారు
నీ చేతులు సుకుమారం అందుకే నా మనవరాలు చేయి వేసిన గోర్లు గుచ్చుకొని నీకు గాట్లు పడుతున్నాయి దానికి తనని అంటే తను ఏం చేస్తుంది ?? అని అంటారు
అవును మరి అదే చెప్పుకుంటున్నారు ఊరంతా ఈ చేతులతో మన అమ్మవారికి ఎన్నో సేవలు చేస్తున్నాను ఇంట్లో పని అంతా చేస్తున్నాను మీ పని చేస్తున్నాను ఇన్ని చేస్తున్న ఈ చేతులు సుకుమారమని మీరే చెప్పాలి అని చిరుకోపంగా అంటూ ఆవిడ వంట గదిలోకి వెళ్ళిపోతారు
కాసేపటికి మోక్ష రేడి అయి బయటికి వచ్చి అన్ని సిద్ధం చేసిన పళ్లెం పట్టుకొని పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళుతుంది
ఏంటి తాతయ్య నువ్వు కూడాను ?? నేను పెట్టకపోతే నా దేవి అలాగే ఆకలితో ఉండిపోతుందని నీకు తెలుసు కదా చూడు చాలా లేట్ అయిపోయింది ఈరోజు అని అంటూ స్వయంగా తన చేతులతో పూలమాలను ముందు రోజే గుచ్చి ఉంచడంతో దానిని అమ్మవారి మెడలో అలంకరించి… అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెడుతుంది స్వయంగా విగ్రహం దగ్గరే
బియ్యం పెసరపప్పు తో చేసిన చక్కెర పొంగలి అరటికాలో వేసి అమ్మవారి నోటి దగ్గర పెట్టగానే అది ఖాళీ అయిపోతుంది… పెద్దగా ఆశ్చర్యపోలేదు అక్కడే ఉన్నా తన తాతగారు ఎందుకంటే ఇది రోజు జరుగుతున్నది
మొదట్లో అంటే ఆ పాప కొంచెం పెరిగీ అన్ని తెలిసే వయసు వచ్చేసరికి పంతులు గారు చేస్తున్న పూజ మొత్తం దగ్గర నుంచి చూస్తూ నేను చేస్తాను అని ఒక రోజు గొడవ మొదలు పెడుతుంది
సరే అని చెప్పి ఆయన ఒప్పుకొని దగ్గరుండి చేయిస్తూ ఉన్నప్పుడే ప్రసాదం కూడా మామూలుగా రాగి పళ్లెంలో అరిటాకులో పెట్టి దగ్గరికి చూపించమని ఆయన ఎత్తుకొని చెప్పగానే
తన చిట్టి చేతులతో నోటి దగ్గర పెడుతుంది… అయిపోయింది తాతయ్య అని మోక్ష చెప్పగానే కిందకి దించి ఆ పళ్లెం చూసినా పంతులు గారు ఖాళీ అయిన ఆ పళ్ళాన్ని చూసి ఆశ్చర్యపోతారు
అప్పటినుంచి తను అమ్మవారి బిడ్డగా వచ్చింది నిజమే అని నమ్మే రోజు తన చేదే పూజ చేయిస్తారు అది క్రమం తప్పకుండా నేటి వరకు కొనసాగుతుంది
తాతయ్య అమ్మవారి పేరు మీరే పెడతారా అసలు ఎలా పెట్టారు ఇంత పెద్ద పేరు అని అడుగుతుంది గర్భగుడి ద్వారం మీద అందంగా చెక్కి దిద్దిన అందమైన అక్షరాల వైపు చూస్తూ
అది నేను పెట్టిన పేరు కాదు శతాబ్దాల నుంచి ఈ తల్లి ఇక్కడ నివసిస్తుంది అప్పుడెప్పుడో స్వయంగా రాతి విగ్రహంల పుట్టిన ఈ అమ్మవారిని ఇక్కడ పని చేస్తున్న కూలీలు చూసి దీన్ని ప్రతిష్ట చేసి పూజించడం మొదలు పెడతారు
మా తాతల ముత్తాతల హయాం నుంచి వచ్చిన పూర్వపు గుడి అందుకే ఈ గుడి ప్రాచీణ్యం ప్రాధాన్యత కట్టడాలు అన్నీ కూడా పూర్వ వైభవాన్ని తలపిస్తాయి
నేటి గుడులు ఇలా ఉండవు కదా అమ్మ ఆధునిక సాంకేతను తెలుపుతాయి అని అంటారు
హ్మ్మ్…. అయితే అమ్మవారి పేరునే నాకు నామకరణం చేశారా అని అడుగుతుంది
హా ” మాధవేశ్వరి శృంగాల మోక్షాంబికాదేవి ” ఇంత పెద్ద పేరులో నీకు ఏ పేరు పెట్టాలని నేను మీ నాయనమ్మ ఆలోచిస్తుంటే బసవయ్య వచ్చి చెప్పాడు ఇప్పుడు తరాన్ని బట్టి కొంచెం కొత్తగా ఉండాలి అంటే మోక్షా అని పేరు పెట్టండి అయ్యారు అని
మాకు అదే నిజం అనిపించింది అందుకే ” మొక్షా దేవీ ” నామకరణం చేశాను దీనికి ఇంకొక కారణం కూడా ఉంది అది ఏంటనేది ముందు ముందు నీకే తెలుస్తుందిలే ఇప్పుడిప్పుడే లోకజ్ఞానం గురించి అన్ని తెలుసుకుంటున్నావు అని తన తల మీద చేయి వేసి నిమురుతూ అంటారు
సరే సరే నా లక్ష్మీ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇంటికి వెళ్తున్నాను మీరు ఇక్కడ చూసుకొని రండి తాతయ్య అని చెప్పి చెంగు చెంగున గెంతుతూ ఇంటికి బయలుదేరింది మోక్ష
@@@@@
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ…. ఏంటి లక్ష్మి నా వైపు అలా చూస్తున్నావ్ ఈరోజు నీ దగ్గరికి లేటుగా వచ్చానని ఆలోచిస్తున్నావా ??
మరేం చేయరు నీ దగ్గరికి వద్దామని దేవి దగ్గర సెలవు తీసుకుని ఇలా బయలుదేరాను లేదో అంతలో ఇంకొక చిన్న పని పడింది అది చూసుకొని ఇటు వచ్చేసరికి ఈ టైం అయింది
లేట్ అయింది నా లక్ష్మీ మళ్ళీ నా మీద అలుగుతుంది అని ఆలోచించి నీకోసం నీకు ఇష్టమైనది తెచ్చాను చూడు అని అనగానే అప్పటి వరకు తన మాటలను శ్రద్ధగా పెద్ద పెద్ద కళ్ళతో వింటున్న ఆవు ( లక్ష్మీ ) మోక్ష చేతిలో ఉన్నది చూడగానే ” అంబా ” అని అరుస్తూ తల ఊపుతుంది
తనతో పాటు తెచ్చిన గడ్డిని ఇష్టంగా దానికి తినిపిస్తూ… ఏంటమ్మా ఈరోజు నీ కళ్ళు నీరసంగా ఉన్నాయి ఏమైంది? నీ బొజ్జలో ఉన్న బేబీ బరువు మోయలేకపోతున్నావా అని లాలనగా అడుగుతుంది నిండు కడుపుతో ఉన్న ఆవు పొట్ట మీద నిమురుతూ
స్టోరీ కంటిన్యూస్…..
ఇది మన హీరోయిన్ ఇంట్రో !! ఎలా ఉందో మీ కామెంట్ లో చెప్పేయండి
మీ అందరూ ఎదురు చూస్తున్నా హీరో ఎంట్రీ రేపు చూద్దాం
Swipe left/right or tap the sides to turn pages