New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 19

అగ్నిసాక్షి 🔥 – 19

 

“యశోదా… కొన్ని డేస్ వాళ్ళతోనే ఉండనివ్వు. ఎందుకంటే అది వచ్చి కూడా ఎక్కువ డేస్ అవ్వలేదు కదా! అయినా వాళ్ళు పక్కపక్కనే ఉంటారు. మనమే కదా రావాల్సింది. ఈ బుడ్డోడి కోసం అయినా ఎలాగో వస్తాం కదా! ఆ రావడం ఎందుకు? ఇక్కడే ఉంటే అయిపోతుంది. ఆరు బాబుని తీసుకొని వచ్చే ఒక టూ డేస్ ముందు మనం ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. అయినా మనవాళ్ళ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలి కదా! మర్చిపోయావా ఏంటి?” అని అడిగారు రమేష్ గారు.

 

“అవును అండి! మర్చిపోయాను. పంతులు గారిని అడిగి చూద్దాం.” అన్నారు యశోద గారు.

 

యశోద గారు అలా అనడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు. పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ మనసుల్లో మాత్రం వేద జ్ఞాపకాలే తిరుగుతున్నాయి.

 

వేద గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఇలా బాధపడుతూ ఉండకూడదంటే ఆరు, యష్ ఇద్దరూ బుడ్డోడితో కలిసి ఉండాలని రాధిక గారు అనుకున్నారు. వాళ్ళిద్దరూ బిడ్డ బాధ్యత తీసుకుంటే కనీసం ఆ చిన్నారి కోసం అయినా తమ జీవితాలను ముందుకు తీసుకెళ్తారని ఆమె భావించారు.

 

అందుకే ఆలస్యం చేయకుండా పంతులు గారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

 

అలా పెద్దవాళ్ళు తమ ఆలోచనల్లో ఉండిపోతే, యష్ మాత్రం ఆఫీస్ కాల్‌తో బిజీ అయిపోయాడు. ఆరు మాత్రం వేద గురించిన ఆలోచనల్లోనే మునిగిపోయింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue