New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 3

అగ్రిమెంట్ వైఫ్ – 3

ఒకరోజు నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు తేజ్ వాళ్ళ నాన్న భూపతి వర్మ గారు ఆఫీసులో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు 

ఇప్పటివరకు సీఈఓ గా ఉన్న రవితేజని ఆ పోస్ట్ నుంచి తప్పుకోవాలని షేర్ హోల్డర్స్ అందరూ మీటింగ్ ఏర్పాటు చేయమని కండిషన్ పెట్టారు సో రేపు ఆఫీస్ కి వెళ్లి ఆ బాధ్యతనుండి తప్పుకోవాలి హుందాగా లేదంటే మనమీద కేసు ఫైల్ చేస్తామన్నారు అది మన బిజినెస్ కి చాలా ప్రమాదం… ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు అని అతడి బాధని వ్యక్తపరుస్తారు 
ఆ బాధకి ప్రత్యక్ష కారణం తనే అయినందుకు చెప్పలేని గిల్టీ ఫీలింగ్ మనసు నిండా నిండిపోగా సరే డాడ్ రేపు తప్పుకుంటాను ఇందులో తప్పేముంది నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఆ విషయం వాళ్ళకి కూడా తెలిసింది 
రేపు ఉదయం నీతో పాటు నేను వస్తాను అని చెప్పి తింటున్న కంచంలోనే చేయి కడిగేసి మౌనంగా వెనుతిరుగుతాడు… వెళ్తున్నా తనవైపు కన్నీళ్ళతో చూస్తూ ఉండిపోతారు కుటుంబ సభ్యులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి 
మర్నాడు ఉదయం అందరూ హాల్ లో ఉండగా ఒకప్పుడు సూట్ వేసుకొని రాజుల దిగివచ్చే కొడుకు  ఇప్పుడు నార్మల్ ఎంప్లాయ్ ల ప్యాంటు షర్ట్ వేసుకొని తేజం లేని నవ్వుతో మరొకరి సహాయంతో వీల్ చైర్ లో వస్తుంటే ఆ కన్నతండ్రి కళ్ళల్లో కన్నీటి చెమ్మ 
                 @@@@
వందల మంది నిండిపోయిన బిజినెస్ మీటింగ్ హాల్.. ఆ హాల్లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతడి మదిలో బాధ ఇంతకుముందు ఫుల్ గ్రేస్ తో ఆటిట్యూడ్ లుక్స్ తో తనంతట తానుగా డీల్ చేసిన ఎన్నో కోట్ల ప్రాజెక్ట్ అవన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటే కళ్ళల్లో కన్నీటి చెమ్మ చెరుతుంది 
కానీ బయటికి మాత్రం అతని బాధ నీ ఎవరికి  కనిపించనివ్వకుండా గంభీరంగా ఏమాత్రం ఇంతకుముందు ఉండే పొగురుకి తీసుపోకుండా చూస్తూనే వెనక మధు అతడు వీల్ చైర్ తోసుకుంటూ నడిపిస్తుంటే ఎటువంటి భావం లేకుండా చూస్తున్నాడు అందరి వైపు
అప్పటికే ఆఫీస్ కి వచ్చి క్లైన్స్ తో మీటింగ్ కి ఎటెండ్ అయ్యి అక్కడికి వస్తారు భూపతి వర్మ గారు 
ఆయన రాగానే అందరూ లేచి విష్ చేసి మీటింగ్ స్టార్ట్ చేస్తారు… ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని ఎత్తిచూపుతూ ఇప్పటివరకు సీఈఓ పదవిలో ఉన్న తేజ్ ని తీసివేయాలని వాళ్లలో ఉన్న మరొకరిని ఆ పదవిలో నిలబెట్టాలని అక్కడ చర్చలు జరుగుతాయి 
” స్టాపిట్ ” హాల్ మొత్తం ప్రతిధ్వనించేలా వినిపించిన వాయిస్ కి అదిరిపడి సైలెంట్ అయిపోతారు… థిస్ ఇస్ ఫిష్ మార్కెట్ ఆర్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ !! అని సీరియస్ గా అడుగుతాడు తేజ్
నీ గురించి టాపిక్ రన్ అవుతుంది మిస్టర్ ఇప్పటివరకు మేము మీ మాట ఇప్పుడు మీరు మా మాట విని రీజైన్ చేయాల్సిందే… చూశారా మిస్టర్ వర్మ గారు మీ అబ్బాయికి కాళ్లు లేకపోయినా పొగరు మాత్రం తగ్గడం లేదు అని ఆయన అన్నారో లేదో వెంటనే వితిన్ సెకండ్స్ లో అతని ముందుకి వచ్చి చేయి పట్టుకుని కిందకి లాగి మరి గొంతు పట్టుకుంటాడు తేజ్ 
వాట్ కమేగైన్ నాకు పొగరు తగ్గలేదా ఆఫ్కర్స్ నేను ఇలానే ఉంటాను… కాళ్లు లేవు కదా అని నీలాంటి లుచ్చాగాళ్ళు చెప్పించుకునే పొజిషన్లో నేను లేను అని సీరియస్ అంటున్న తేజ నీ ఆపుతూ తేజ్ కామ్ డౌన్ నేను మాట్లాడుతాను కదా అని అంటూ 
ఓకే ఎవరీ వన్ !! ఇప్పటివరకు ఈ కంపెనీ కోసం పగలు రాత్రి కష్టపడుతూ ఎన్నో బెనిఫిట్స్ తెచ్చిన నా తర్వాత సీఈఓ నా కొడుకు చేపట్టిన ప్రాజెక్ట్స్ అంతకన్నా ఎక్కువ లాభాలు బాట పట్టించాయి 
కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తినే మీరు తొలగించాలనుకుంటున్నారు మీ అందరికీ కనీస విలువ మర్యాద ఇవ్వడం నా ధర్మం నా కంపెనీలో ఉంటున్నారు కదా అని నా ఓన్ డిసెషన్తో మిమ్మల్ని చులకన చేయలేను 
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బ అన్నట్లు ఇప్పుడు నా కొడుకు పరిస్థితిని మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారు కానీ స్ట్రాంగ్ గా చెప్తున్నాను మళ్ళీ ఏదో ఒక రోజు ఈ కంపెనీ మా అబ్బాయి హ్యాండ్ లోకి వస్తుంది అప్పుడు మళ్లీ మీరు అందరూ ఎలా మాట్లాడుతారో చూస్తాను అని తమ వైపే చూస్తున్న ఇద్దరు వ్యక్తులకి ఘాటుగా సమాధానం చెప్పి తేజ్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా పేపర్స్ రెడీ చేయిస్తారు 
భూపతి వర్మ గారు సైన్ చేసి షేర్ హోల్డర్స్ అందరి చేత కూడా సైన్ చేయించి కరెక్ట్ గా తేజ్ దగ్గరికి వచ్చేసరికి మనసులో బాధ వజ్జానితీతం… కళ్ళల్లో కన్నీటి సంద్రాలు సుడిగుండాల తిరుగుతున్న వాటిని ఎవరికీ కనిపించనివ్వకుండా చేతిలో ఉన్న పెన్ ను గట్టిగా పట్టుకొని పేపర్ మీద పెట్టేసరికి ” ఒక్క నిమిషం ” అన్న వాయిస్ విని ఆగిపోతాడు
ఆ వాయిస్ వచ్చిన వైపుకి అందరూ తిరిగి చూస్తుంటే అంత మందిలో తను మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఏదో చెప్పాలని దృఢంగా నిర్ణయించుకుని అందరికీ మధ్యలో స్టేజ్ కి దగ్గర్లో వెళ్లి కింద నుంచింది మధు 
అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ నమస్తే అని మర్యాదపూర్వకంగా విషెస్ చెప్పి తనని తాను తేజ్ వైఫ్ గా ఇంటర్వ్యూస్ చేసుకుని నా భర్త ఆ పేపర్ మీద సైన్ చేసే ముందు నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి వాటిని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను క్లారిఫై చేస్తారా అని అడుగుతుంది కాన్ఫిడెంట్గా వాళ్ళ వైపు చూస్తూ 
” ఎస్ మిస్సెస్ తేజ్ ” అని ఒకరు అనగానే … మీరు మిస్టర్ తేజ్ ని సీఈఓ పదవికి అన్ఫిట్ అని చెప్పి రిజైన్ చేయమని అడుగుతున్నారు ఆయన అన్ఫిట్ అని ఏ విషయంలో మీరు అనుకుంటున్నారో నాకు క్లారిటీ ఇస్తారా అని అడుగుతుంది 
అఫ్కోర్స్ !! చెప్పడానికి మాకు కొంచెం కష్టంగా ఉన్నా మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పడం లేదు తనంతట తానుగా ఏ పని చేయలేరూ అలాంటి అతను ఒక కంపెనీని ఎలా రన్ చేయగలరు అని అడుగుతారు అందులో ఉన్న ఒకరు 
ఓకే అదే మీ ప్రాబ్లం అయితే ఆయన కంపెనీ ను రన్ చేయడానికి ఆయన వ్యక్తిగత విషయాలు మీకు అనవసరం ఆయన ఆలోచనలు ఆయన హార్డ్ వర్క్ చాలు అనుకుంటాను 
మీ దృష్టిలో సీఈఓ పదవిలో ఉండాలి అంటే ఫిజికలీ హెల్తీ గా ఉండాలి రైట్… కానీ దానికన్నా ముందు క్వాలిఫికేషన్ ,  హార్డ్ వర్క్ , ఐడియాస్ , ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఆయనలో ఉన్నాయని నాతోపాటు మీ అందరికీ కూడా తెలుసు 
సో గైస్ నేను చెప్పేది ఒకటి ఆయనకి నడవడానికి కాలు లేకపోవచ్చు కానీ ఒక కంపెనీని నడిపించగల ఆత్మస్థైర్యం ఆలోచనలు ఎన్నో ఉన్నాయి 
ఇప్పటివరకు ఆయన ఆఫీస్ కి రాకపోవచ్చు కానీ ఇకనుంచి డెఫినెట్గా వస్తారు ఆయన పని ఆయన చేస్తారు కేవలం వైకల్యం ఉన్నది శరీరానికి మాత్రమే కానీ మనసుకి బుద్ధికి కాదు 
మరొక ఛాన్స్ ఇచ్చి చూడండి నెక్స్ట్ త్రీ మంత్స్ లో ఈ కంపెనీ గ్రోత్ని ఇంకొంచెం పెంచుతారు ” దిస్ ఇస్ మై ఛాలెంజ్ ” హుందాగా స్పష్టంగా గట్టిగా మధు అడిగిన తీరుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లబోయారు 
భూపతి గారి కైతే ఆశ్చర్యంతో ఆనందంతో నోట మాట రాలేదు… ఇంత పెద్ద బిజినెస్ రంగంలో ఇన్ని ఏళ్లుగా పనిచేస్తున్న అతను కూడా ఇంత స్పష్టంగా గట్టిగా వాళ్లందరి ముందు తలెత్తి మాట్లాడలేకపోయారు అలాంటిది జస్ట్ పేదింటి అమ్మాయి అని చెప్పి డబ్బిచ్చి కొనుక్కున్న చిన్నచూపు చూసిన తన కోడలు తన భర్త కోసం ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే అసలు ఊహించలేకపోయినా ఆ క్షణం షాక్ లో ఉండిపోయారు 
స్టోరీ కంటిన్యూస్….
   మరి మన తేజ్ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో  ?? తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని మీస్ అవ్వకుండా చదివేయండి