భూపతి గారి కైతే ఆశ్చర్యంతో ఆనందంతో నోట మాట రాలేదు… ఇంత పెద్ద బిజినెస్ రంగంలో ఇన్ని ఏళ్లుగా పనిచేస్తున్న అతను కూడా ఇంత స్పష్టంగా గట్టిగా వాళ్లందరి ముందు తలెత్తి మాట్లాడలేకపోయారు అలాంటిది జస్ట్ పేదింటి అమ్మాయి అని చెప్పి డబ్బిచ్చి కొనుక్కున్న చిన్నచూపు చూసిన తన కోడలు తన భర్త కోసం ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే అసలు ఊహించలేకపోయినా ఆ క్షణం షాక్ లో ఉండిపోయారు