** అజేయ -117**
సియా అరచేతిపై ఒక వైపు రాఘవ్ మరియు సియాలా అందమైన చిత్రాన్ని , మరోవైపు ఒక తన చెలి నీ చేరిన వీరుడి రూపాన్ని రాఘవా మరియు మైథిలి లా చిత్రాన్ని అందం గా మెహందీ వేయిస్తోంది..
మరోవైపు… రాఘవ్ రాయల్ కుర్తా ధరించి, తన లండన్ రాయల్ డిగ్నిటీతో హాల్ మధ్యలో నిలబడి అందరినీ పలకరిస్తున్నా.. అతడి కళ్లు మాత్రం నిరంతరం సియా పైనే ఉన్నాయి!
రాఘవ్ మెల్లగా తన తల్లి సౌమ్యాదేవి, అత్తయ్య వసుంధరాదేవిల కళ్లు గప్పి సియా కూర్చున్న పీఠం వెనుకకు చేరుకున్నాడు..
మెహందీ ఆర్టిస్టులు కాస్త పక్కకు తప్పుకోగానే… రాఘవ్ వంగి సియా చెవిలో వెచ్చగా అతని శ్వాస నీ పరిచయం చేస్తూ..ఊదాడు!
“హ్మ్మ్ !” అంటూ సియా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి రాఘవ్ నీ చూస్తూ..