** అజేయ -116 **
“సరే పిల్లలూ…” అని రామ్‌భూపాల్ రాయల్ గంభీరంగా మాట్లాడుతూ…
“మీరిద్దరూ గుహలో సాగించిన పోరాటం, విక్రమ్ యొక్క కుట్రలను అంతం చేయడం, అజేయ ఖడ్గాన్ని దక్కించుకోవడం ద్వారా…
మన సామ్రాజ్యపు ధర్మాన్ని నిలబెట్టారు.. ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకా ఒకటి మిగిలే వుంది !”అని.. అనగా..
వాళ్ళ మాటలకి..రాఘవ్, సియాలు ఇద్దరూ కూడా లేచి నిలబడ్డారు..
రామ్ భూపాల్ గారిని చూస్తూ..”ఏంటి డాడ్?” రాఘవ్ అడిగాడు..