** అజేయ – 89 **
సియా ని బంధించిన..విక్రమ్ ఉన్న పాత బ్రిటిష్ కాలపు కోట ఎక్కడుంది? అక్కడ ఎంతమంది గార్డ్స్ ఉన్నారు?
ఇలా ప్రతి ఒకటి.. అలాగే రాఘవ్ ఉన్న డెడ్-ఎండ్ లోయ నుండి ఆ కోటకు వెళ్లే రహస్య అడవి మార్గం ఇలా ప్రతిదీ రాఘవ్ మైండ్ లో ఒక క్లియర్ రూట్‌గా చూపిస్తోంది..
విక్రమ్ సియాను బంధించిన పాత కోట అంతర్భాగం అతడి కళ్లముందు స్పష్టంగా పరుచుకుంది..
కోటలోని రౌడీల స్థావరాలు, పవర్ కేబుల్స్ ఉన్న ప్రదేశం, కోట వెనుక నుండి అహోబిలం కొండలపైకి వెళ్లే పురాతన దారి సులభంగా డీకోడ్ అయ్యాయి..
ఇప్పుడు అందరూ కూడా అజేయ ఖడ్గం భైరవ కోన జలపాతం వెనుక ఉందనుకుంటున్నారు..