** అజేయ – 87 **
అతని తల వెనుక నుండి వేడి రక్తం ధారగా కారి, అతని మెడ మీదుగా నేలపైకి చుక్కలు చుక్కలుగా పడటం ప్రారంభించింది..
సరిగ్గా అదే సమయంలో, లూయిస్ సియాను బలవంతంగా పట్టుకున్నాడు..
సియా చేతులను వెనుకకు విరిచి పట్టుకోవడం తో.., ఆమె గొంతు వద్ద విక్రమ్ తన సైలెన్సర్ గన్ను అయిమ్ చేసాడు..
సియా తనని లాక్ చేసిన మనుషుల కంటే.. రాఘవ్ రక్తం చూస్తూ.. భయం తో.. రాఘవ్ .. రాఘవ్.. అంటూ ఏడుస్తుంది..
రాతి నేలపై పడి ఉన్న రాఘవ్ తల నుండి రక్తం ధారగా కారుతోంది… అతడి కళ్లు మసకబారుతున్నాయి, శరీరం నిరసించిపోతోంది…