** అజేయ – 95 **
ఆ ఫ్యాక్టరీ లో వున్నా ప్రైవేట్ మెర్సనరీస్కు పిచ్చి పట్టినట్టు అవుతుంది..
చీకట్లో ఎవరు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫ్లాష్ లైట్ వెలుగు పడిన ప్రతిచోటా… తమతో ఉన్న సహచరుడు స్పృహతప్పి పడి ఉండటం మాత్రమే కనిపిస్తోంది!
కానీ శత్రువు వారి కంటికి కనిపించడం లేదు, కానీ మృత్యువులా ప్రతి మూల నుండి వారి పై దాడి చేస్తున్నాడు!
ఆ ఫ్యాక్టరీ పైకప్పులోని పగుళ్ల నుంచి వెన్నెల కిరణాలు నేలపై పడుతున్నా, ఆ విశాలమైన ప్రాంగణమంతా దట్టమైన, కదలలేని చీకటి అలుముకుంది..
అక్కడక్కడా తుప్పు పట్టిన యంత్ర పరికరాలు, ఎత్తుగా పేర్చిన ఖాళీ డ్రమ్ములు ఆ చీకటిలో భయానకమైన నీడలను సృష్టిస్తున్నాయి..