** అజేయ – 96 **
మోచేతుల వరకు ఫోల్డ్ చేసిన స్లీవ్స్ అతడి మస్కులర్ ఆర్మ్స్‌ను మరింత పవర్‌ఫుల్ గా చూపిస్తున్నాయి..
రాఘవ్ సిల్కి హెయిర్ అతడి నుదిటి మీద పడుతూ.. సింహం జులు ని తలపిస్తున్నాయి..
అతడి కళ్లలో… విక్రమ్ వైపు చూస్తున్న ఆ చూపుల్లో… ఎవరూ తట్టుకోలేని ఒక ప్రచండమైన ఉగ్రరూపం ప్రకాశిస్తోంది!
రాఘవ్ చేతిలో ఎలాంటి ఆయుధం లేదు. కేవలం బిగించిన పిడికిళ్లు మాత్రమే ఉన్నాయి..
అతడి కుడిచేతి నరాల్లో ద్రవ రూపంలో ఉన్న ఆ ‘అజేయ’ లోహపు మెరుపులు చర్మం లోపల నీలిరంగులో ప్రవహిస్తూ, అతడికి ఒక దైవ రూపపు ఆరా ను ఇస్తున్నాయి..