ఇంద్ర ఒక్కడే కార్ దిగడంతో చూసి చూడనట్టుగా ఉన్న స్వర్ణ ముందుకి వచ్చి నీతో అమ్మ మాట్లాడుతా అంటుంది అన్నాడు…
నేను ఇక్కడ ఉన్న అని అత్తయ్య కి ఎందుకు చెప్పావ్??? అని కోపంగా చూస్తూ అడిగింది…
నీకు నా మీద కోపం ఉండొచ్చు… కానీ మా అమ్మ నాన్న మీద ఏ కోపం లేదనుకుంటున్న స్వర్ణ!! అని ఫోన్ ఆన్ లాక్ చేసి స్వర్ణ ముందున్న కృష్ణుడి విగ్రహం ముందు పెట్టి… ఈ నాలుగు నెలలుగా వాళ్లు నీ గురించి ఆలోచించని రోజు లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు..
ఇంద్ర, అనసూయలు అసహ్యంగా చూసిన దేవయాని, రఘునాథ్ గార్లు ఇంటి ఆడపిల్ల గానే మహాలక్ష్మి లానే చూశారు…