అవునే! దూరంగా ఉంటే మగాడు మరోదాన్ని తగులుకుంటాడే గానీ మనసులో ఉన్న దాన్నే తలుచుకుంటాడు అనుకోవడం పొరపాటు… ఏదైనా కళ్ళ ముందే ఉండి సాధించుకోవాలి… నిన్ను తక్కువగా చూసిన వాళ్లే కళ్ళు పెద్దగా చేసి మరి చూసేలా ఎత్తుకు ఎదగాలి… చులకనగా మాట్లాడిన నోళ్లే మూత పడేలా నీ సక్సెస్ సమాధానం చెప్పాలి స్వర్ణ…
చిన్నప్పటి నుండి నీ ఆత్మ గౌరవాన్ని చూసిన దాన్ని నిన్ను ఎక్కడ తగ్గమని చెప్పనే అది నా కొడుకు దగ్గర అయినా సరే… ఆడది ఒక్కసారి తగ్గితే అణుకువ అనుకోరు.. ఇంకా అణిచేయాలని చూస్తారు
ప్రేమ పేరుతోనో.. బంధం పేరుతోనో నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోమ్మని నేను చెప్పట్లేదే… కానీ వయసుకి వచ్చిన ఆడపిల్లవి నువ్వలా బయట ఎక్కడో ఉంటే మా ప్రాణాలు విల విలలాడుతున్నాయి…
మాకోసం వచ్చేయ్ స్వర్ణ!! నీకు ఇంద్ర అంటే ఇష్టం లేకపోతే వాడితో మాట్లాడకు.. కానీ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ కోసం అయిన అలోచించి ఇక్కడికి రావే… నీ కన్న తల్లిని కూడా వదిలి వెళ్లిపోయావ్ అంటే నీ మనసు ఎంతగా విరిగిపోయిందో ఓ ఆడదానిగా అర్ధం చేసుకోగలను స్వర్ణ అన్నారు దేవయాని గారు…