ఇంద్ర కి దగ్గరగా ఉండటంతో తన గుండె చేసే సవ్వడి ఓ మధురమైన సంగీతం లా వినిపిస్తుంటే కళ్ళు మూసుకొని మైమరుపుగా తలని ఆ గుండెకి ఆనించి రెండు చేతులని ఇంద్ర చుట్టూ వేసింది…
స్వర్ణ తనని హత్తుకోవడం సంతోషంగా అనిపించి సున్నితంగా స్వర్ణ చుట్టూ చెయ్యేస్తూ గాలి కూడా దూరనంతగా దగ్గరగా తన గుండెలకి అదుముకున్నాడు…
ఆ స్పర్శలో కామపు వాంఛ కనిపించట్లేదు… నీకు నేనున్నాను అనే ఆత్మీయత భావన చుట్టూ ముట్టడంతో ఆ వెచ్చదనం ఆ రక్షణ స్వర్ణ మనసులోని నెగటివిటీని పటాపంచలు చేశాయి… ఆ గుండె చప్పుడుని లయబద్ధంగా వింటూ నమ్మకంతో స్వర్ణనే స్వయంగా ఆ కౌగిలిని మరింత బిగించింది…
ఆ సంఘటనకి ఇంద్ర మనసు మరింత సంతోష పడితే.. తొందర పడకుండా ఆ కౌగిలిని బిగించలేదు అలా అని విడిపించలేదు ఓపికగా స్వర్ణ మనసుని తన అలజడిని చదివే ప్రయత్నం చేశాడు…