సరే నీకు కేర్ టేకర్ గా వెళ్ళాలి అనిపిస్తే హ్యాపీగా వెళ్ళు బంగారం నీ హ్యాపీనెస్ కి నేను అడ్డు రాను అన్నాడు…
హ్! అని మూతి తిప్పుతూ బ్యాగ్ లో తన బట్టలన్నీ కబోర్డ్ లో సర్దుకుంది…
ల్యాప్ ట్యాప్ లో వర్క్ చూసుకుంటున్న ఇంద్ర కి దేవయాని గారు ఫోన్ చేయడంతో స్వర్ణని చూస్తూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు
హాలో అని కూడా అనకుండా నాన్న! ఇంద్ర స్వర్ణ ఎలా ఉంది రా అని ఆప్యాయంగా అడిగారు దేవయాని గారు…