సరే మరి వెళ్ళొస్తా బాయ్ అని వెళ్లిపోతుంటే క్షణంలో ఐడియా వచ్చి ఇంద్ర అని సోఫా తగిలి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేసింది స్వర్ణ..
ఎందుకంటే ప్రియారిటి ఎవరికీ ఇస్తాడో తెలుసుకోవాలి అనుకుంది…
తనకి దెబ్బ తగిలిన పట్టించుకోకుండా ఆఫీస్ కి వెళ్ళిపోతాడా? లేకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని తన కోసం ఉండిపోతాడా? అనే ఆలోచన వచ్చి పడిపోయింది…
స్వర్ణ అరుపుకి వెనక్కి తిరిగి నిజం అనుకున్న ఇంద్ర ఒక్కడుగులో స్వర్ణ ని చేరి బంగారం ఏమైంది అని కంగారుగా అడిగాడు…