ఇంద్ర మాటలు విన్న స్వర్ణ పెదవులపై వ్యంగ్యపు నవ్వు మెరిసింది….
మాటలు చెప్పడం చాలా సులభం ఇంద్ర… కానీ విరిగిన మనసును మళ్లీ అతికించడం అంత సులభం కాదు అని లేవబోయింది.
అంతలోనే ఇంద్ర ఆమె మణికట్టును పట్టుకుని విరిగిన మనసును అతికించలేనని నాకు కూడా తెలుసు స్వర్ణ… కానీ అదే మనసు నన్ను మళ్లీ అంగీకరించే వరకు ఎదురు చూడగలను… ఈసారి నేను పరుగెత్తేది నీ వెనకాల కాదు… నా తప్పులను సరిదిద్దుకునే దారిలో అని మళ్ళీ స్వర్ణ పెదాల దగ్గర ఫుడ్ పెట్టాడు…