పదవ భాగం
నేను నాన్న వైపు మౌనంగా చూడగానే నాని మళ్ళీ తిరిగి చెప్పడం ప్రారంభించాడు
మీ అమ్మ పోలీస్ అవ్వాలని చాలా ధైర్యంగా ఉండేది తప్పు జరిగితే నిలదీసేది దానితో అందరూ మీ అమ్మని మగరాయుడిలా ఉంది ఆడపిల్లల లక్షణాలు ఒకటి కూడా లేవు అనే వాళ్లు కానీ నాకు తెలుసు మీ అమ్మ ఎంత సున్నితమైన మనస్కురాలో అని అందుకే ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వేరే వాళ్ళు వాళ్ల గురించి చెప్పే వాళ్ళ మాటలను బట్టి కాదు వాళ్ళు మనతో ఉండే ప్రవర్తన్ని బట్టి తీసుకోవాలి అని చెప్పారు
నేను నాన్నని ఇదంతా నాకు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అన్నట్టు చూశాను
నాన్న నవ్వుతూ మీ అమ్మ ఉంటే ఎప్పుడో చెప్పేది ఇదంతా నేను ఇంకా లేటుగా చెప్తున్నా సరే ఇంకా ఇంటికి వెళ్దామా అన్నారు నేను హా! అని తల ఊపాను నేను నాన్న ఇద్దరం ఇంటికి వచ్చేసాం నాన్నకు గుడ్ నైట్ చెప్పి నా గదికి వచ్చేసాను