ఎస్.ఎస్. సొల్యూషన్స్ – ఉదయం 10:30]
అభి తన క్యాబిన్‌లో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. రాత్రి తాగిన మత్తు ఇంకా పూర్తిగా దిగినట్టు లేదు, తల భారం పెరిగిపోతోంది. రాత్రి రెస్టారెంట్‌లో ఏం జరిగిందో ముక్కలు ముక్కలుగా గుర్తొస్తోంది కానీ, చివర్లో తను ఇంటికి ఎలా వెళ్ళాడో మాత్రం అస్సలు గుర్తులేదు.
పక్కనే నిలబడి ఉన్న రామారావు వైపు అనుమానంగా చూశాడు అభి.
అభి: “అబ్బా రామారావు! రాత్రంతా ఎవరో నా తల మీద ఎక్కి డాన్స్ చేసినట్టు ఉంది అయ్యా! విపరీతమైన తలనొప్పిగా ఉంది. అసలేం జరిగిందో ఏంటో!”
రామారావు: (కంగారుగా నసుగుతూ) “ఇంకెవరు సార్.. ఆ కొత్త మేనేజర్ మీరానే కదా! ఆమె మీ పక్కన వచ్చి కూర్చోవడం, ఆ తర్వాత మీరిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం.. అంతా వింత వింతగా జరిగింది సార్.”
అభి తన జుట్టు సవరించుకుంటూ, ఒక్కసారిగా రాత్రి తను ఇంటికి చేరిన విషయం గుర్తొచ్చి రామారావు వైపు కృతజ్ఞతగా చూశాడు.