“చాల్లే ఇక ఆపేయ్.. నువ్వు ఎంత తింటావో నీ కడుపు ఎప్పుడూ నిండుతుందో నాకు తెలియదా..! ముందు పాలు తాగు.” అని గదామాయించింది శైలు.
ఇంకో మాట మాట్లాడకుండా గబగబా పాలు తాగి గ్లాస్ అక్క చేతిలో పెట్టాడు శౌర్య.
తన చీర కొంగుతో తమ్ముడు పెదాలు తుడిచి..”మనకి కొత్తనా చిన్న నానమ్మ మాటలు..! ప్రతి దానికి ఇలా బాధపడకూడదు రా.” అని అంది శైలు.
“బాధగా అనిపించలేదు అక్క.. కానీ నేను ఏదో లహరికి బాగో లేకుండా ఉన్న సాయం సమయంలో, పిన్ని బాబాయ్ బాధలో ఉన్న కూడా నా సంతోషం నేను చూసుకోవాలి అనుకుంటున్నాను అనే విధంగా నానమ్మ మాట్లాడే సరికి.. నేనే తప్పు చేస్తున్నానేమో, నా ఆలోచనే తప్పేమో అనిపించింది.” అని అన్నాడు శౌర్య.