[హాస్పిటల్ రోడ్డు – అర్ధరాత్రి]
జహ్నవి తన కారు పాడైపోయిందని, ఈ అర్ధరాత్రి ఎలా వెళ్ళాలో తెలియక టెన్షన్‌తో రగిలిపోతోంది. సరిగ్గా అప్పుడే వివాన్ తన దృష్టిని పక్కకు మళ్ళించాడు. రోడ్డు అవతల ఒక చిన్న బండి దగ్గర నుంచి వేడి వేడి పొగలు వస్తూ, మంచి వాసన వస్తోంది.
వివాన్: (ఉత్సాహంగా) “మేడమ్.. అదిగోండి! అక్కడ బజ్జీల బండి ఉంది. పదండి వెళ్దాం!”
జహ్నవి ఒక్కసారిగా వివాన్ వైపు అయోమయంగా చూసింది. తను కారు గురించి టెన్షన్ పడుతుంటే, ఈయనకి బజ్జీలు గుర్తొచ్చాయా అని ఆమెకు పిచ్చికోపం వచ్చింది.