లక్ష్మీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీరసంగా ఉండే సరికి, చిన్న పాపను ఎలా చూసుకుంటుంది అనే ఉద్దేశంతో లక్ష్మి తల్లిదండ్రులు, ఆ ఇంటిలో పెళ్ళి చేసుకోకుండా ఉన్న ఆ అమ్మాయి కలిసి ఆ పుట్టిన పసికందును వాళ్ళే పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు.
***
లక్ష్మీ తల్లిదండ్రులు అందరికీ పెళ్లిళ్లు చేస్తున్నపుడు వాళ్ళ కష్టం గమనించి.. చివరగా ఉన్న తమ్ముడు చేతికి అందివచ్చే వరకు తాను ( లక్ష్మి చెల్లి ) ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుని..
“పెళ్ళి ఇష్టం లేదు, పెళ్ళి కొడుకు నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు..” అలా ఏదో ఒక వంక పెడుతూ పెళ్ళి చేసుకోకుండానే ఉండిపోయింది.
ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పి పెళ్ళి చేయాలని చూసినా వినలేదు.. అందరి కోసం ఆలోచించి అలా ఉన్నందుకు అందరికీ ఆమె అంటే ఇష్టం, భయం కూడానూ.. కానీ ఒక్క తండ్రి మాటకు మాత్రమే ఆమె కట్టుబడి ఉంటుంది, మర్యాద ఇస్తుంది. అలా అని ప్రతి చిన్న విషయంలోనూ అతను దూరిపోడు. ఏమి చేసినా అందరికీ మంచి జరిగే పనే చేస్తుందని అతని నమ్మకం..
ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే మామూలుగానే ఆవిడ మాటకి ఎవరు ఎదురు చెప్పరు, తను ఏదంటే అది చేయాల్సిందే.. అందుకే ఎవరు ఏమి మాట్లాడలేదు. అప్పటి వరకు పాపకు పేరు పెడతామని ఆనందంతో ఉన్న ఇల్లంతా వీరి వాదనలతో, అరుపులతో.. ఊపిరాడని భయంకర గృహాల తయారయింది..