లక్ష్మికి కాన్పు విషయంలో సీరియస్ అవడంతో.. అప్పుడే పుట్టిన పసికందును ఆమె తల్లిదండ్రులు తమ వద్ద నే ఉంచుకోవాలి అని అనుకున్నారు. పాప కి పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో కొద్ది పాటి గొడవ జరగగా.. ఆ బుడ్డాగాడి అల్లరితో మళ్ళీ అందరూ నార్మల్ అయిపోయారు.
***
ఉన్నట్టుండి ఆమె, ఆ పాపకి సీత అని పేరు ఎందుకు పెట్టిందొ ఎవ్వరికి అర్థం కాలేదు. అడగాలి అంటే భయం.. తండ్రి ఎటూ ఆమెను ఏమి అనడు.. ఇక తల్లి అయితే చాలా సంతోషంగా ఉంది.. ఏమి జరిగిందో.. ఏమి జరుగుతుందో ఎవ్వరికి అర్థం కాలేదు.
అయితే వాళ్ళల్లో వాళ్ళు మాత్రం మెల్లగా ఏదో మాట్లాడుకుంటున్నారు. సడన్ గా లక్ష్మీ లేచి..
“అదేంటి చెల్లి! ఏ పేరు పెట్టాలి అనుకున్నాం? నువ్వు ఇప్పుడు ఏ పేరు పెట్టీ పిలిచావు? అయినా సీత అని ఎందుకు చెప్పు.. సీతమ్మ తల్లి లా నా కూతురు కష్టాలు పడాలా?!” అని చాలా ఆవేదనగా… బాధగా అడిగింది.
“చూడు.. నీ కూతురు అనే ఉద్దేశం నీకు ఉంటే ఇప్పుడే నీ కూతురిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో.. ఈ ఇంటి బిడ్డగా పెరగాలి అనుకుంటే మాత్రం దాని విషయంలో ఎప్పుడూ కలుగ చేసుకోకు..” అని ఆమె కొంచెం కఠినంగా అంటుంటే మనసు చిన్నబొచ్చుకుని తల దించుకుని మౌనంగా ఉండిపోయింది లక్ష్మీ.