New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె మనసులో.. సీత కథ – 16

ఆమె మనసులో.. సీత కథ – 16

ఆ పాపకి పేరు పెట్టే సమయానికి ఇంట్లో చిన్న రభస లాంటిది జరుగగా.. చివరికి లక్ష్మీ చెల్లి గబగబా వెళ్లి పాపకు సీత అని పేరు పెట్టింది. ఆ పేరు వినేసరికి అందరూ షాక్ అయ్యారు. లక్ష్మి ఇదేంటి అని అడిగేసరికి తనను ఒక పక్క తిడుతూనే.. మళ్ళీ నీకు భయం లేదన్నట్టు భరోసానిచ్చారు తండ్రి కూతుర్లు. అది చూసి మిగిలిన వారందరికీ కొత్త అనుమానాలు కలిగాయి. 

 

***

 

వాళ్లందరూ అడుగుతూ మధ్యలో ఆగిపోయిన ప్రశ్నకి.. “ఏంటి?” అన్నట్టుగా చూసింది ఆ చిన్న కూతురు.

 

“అబ్బే! అదేమీ కాదు ఏం అడగాలనుకున్నామంటే..” అని ఒకరు ఏదో చెప్పబోతుంటే..

 

మధ్యలో ఇంకొకరు అడ్డు పడి.. “ఏమి లేదులే.. వదిలెయ్యి, అది అలానే ఏదో ఒకటి నోటుకు వచ్చింది వాగుతా ఉంటుంది. నీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు దాని మాటలకి అలా కోపం తెచ్చుకుంటావ్.. ఇక్కడ ఇంకా ఇప్పటికే జరిగింది చాలు, ఇంక సరే పదండి దాన్ని ఉయ్యాల వేసి చూసుకుందాం. చాలా సమయం అయింది దానికి పాలుగట ఏం ఇవ్వలేదు” అని అంటూ అప్పటికి ఆ విషయాన్ని పూర్తిగా దాటేసేలా చేసింది ఆ ఇంటి పెద్ద కూతురు..

 

చిన్న కూతురు చిన్న కూతురు అంటున్నాం కదా.. ఆమె పేరు దుర్గా.. చాలా తెలివిగల పిల్ల.. వాళ్ళు ఏం అడగబోతున్నారో కూడా ముందే పసిగట్టి కోపంతో చూసిన చూపుకి తెలివిగా ఆ పెద్ద కూతురు అప్పటికి అక్కడ పరిస్థితిని అలా తెలివిగా సర్దుబాటు చేసింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue