అత్తయ్యని కాబట్టే అన్నీ చెప్తున్నా, వేరే వాళ్ళైతే నువ్వు వేసే వేషాలకి ఈ పాటకి, మెడ పట్టి బయటికి గెంటే వాళ్ళు…!!! మంచం మీద కూర్చుంటూ మళ్లీ గది వైపుకు చూసింది.
తెరిచిన గది తలుపుల మధ్యన చారుమతి కనిపించలేదు.
పడక గదిలో తన పక్క బట్టలు మడతేస్తుంది.
గంటలు గంటలు గదిలోకి దూరి ఏం చేస్తావే. ఆ తలుపులు దగ్గరికి వేసి వచ్చి పని సంగతి చూడు.