ఆర్యన్ ఆఫీస్ కి వెళ్లిన తర్వాత తనకు మనసంతా కీడు సంఖిస్తూన్నట్టు ఉంటుంది…వర్క్ పై కాన్సంట్రేషన్ పెట్టలేకపోతాడు….
కార్ తీసుకుని అశోక్ దగ్గరకు వెళ్తాడు ఇన్ఫర్మేషన్ తెలిసింది రమ్మని చెప్తాడు…
అశోక్ ఏం అయినా తెలిసిందా….
అవును సార్ ప్రణవి గారి ఫోన్ కి 2వీడియోస్ 2 ఆడియో క్లిప్ ఉన్నాయి సార్ అందులో ఏం ఉన్నాయి అని మేము చూడలేదు సార్ మీకు ముందుగా చెప్దామని…..
ఒకే అని వీడియో ఆన్ చేసి చూస్తాడు ఆర్యన్ కానీ కొన్ని సెకన్లకే కళ్ళు మూసుకుని తన కోపాన్ని అదుపుచేసుకుంటాడు….ఆడియో క్లిప్ వింటాడు అందులో అర్జున్ మాట్లాడిన మాటలకి ఆర్యన్ కళ్ళు ఎరుపు రంగులోకి మారాయి…తన చేతి నరాలు పొంగాయి…