నెక్స్ట్ డే కాలేజ్ కి వెళ్ళేసరికి ఒక అమ్మాయి గేట్ దగ్గర నిల్చుని హర్ష కోసం ఎదురు చూస్తూ కనిపిస్తుంది ఒక అమ్మాయి. సింపుల్ రెడ్ కలర్ చుడిదార్ వేసుకుని చిన్ని ఫేస్ తో చామన ఛాయ రంగు తో అందంగా ఉంది. ఆ అమ్మాయిని కనీసం చూడకుండా తన క్లాస్ కి వెళ్ళిపోయాడు హర్ష. తనకి అలవాటే కాబట్టి పట్టించుకోకుండా హర్ష నీ చూసినందుకు హ్యాపీ గా క్లాస్ కి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి..( హర్ష సెకండ్ ఇయర్..ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ..)
సరిగ్గా 15 రోజుల ముందు..
హర్ష ఆ రోజే కాలేజ్ కి వస్తె..అంతకు 10 రోజుల ముందు ఫస్ట్ ఇయర్ లో ఆ అమ్మాయి జాయిన్ అయింది ..పేరు లోహిత. ( హీరా నీ వైజాగ్ లో జాయిన్ చేయడానికి కావలసిన అవసరాలు చూసుకుంటూ హర్ష 10 రోజులు కాలేజ్ కి వెళ్లలేదు )
లంచ్ టైమ్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ గ్రౌండ్ లో చెట్ల కింద లంచ్ చేయడానికి వెళ్తుంది లోహిత. అక్కడే గ్రౌండ్ లో ఒక సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చుని లంచ్ చేస్తున్నాడు హర్ష…మంచి హైట్ తో ఫుల్ కలర్ తో సన్నగా ( పైకి మాత్రమే ) చూడడానికి క్యూట్ గా చాలా అందంగా ఉంటాడు.
లోహిత తన ఫ్రెండ్స్ తో వచ్చి అనుకోకుండా హర్ష వాళ్ళ పక్కనే కూర్చుంది … ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెడుతూ ఫుడ్ తింటున్న లోహిత చూపు అనుకోకుండా హర్ష మీద పడింది. ఒక్క నిమిషం కదలకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది… అప్పుడే వచ్చిన నునూగు మీసాలు లైట్ గా వున్న గడ్డం ఆమెని ఎక్కువ ఆకర్షించింది. చూపు తిప్పకుండా తినేసేలా చూస్తున్న ఆమెని డిస్టర్బ్ చేస్తూ “హేయ్ లోహి … ఏం చూస్తున్నావ్ తిను?? మ్యాథ్స్ సార్ టైమ్ కి రాకపోతే బయటే ఉంచేస్తాడు .. మనం వచ్చిందే లేట్ గా..నువ్విప్పుడు ఇంకా లేట్ చేసి సార్ బయటకి గెంటేల చేయకు అంటూ తొందర పెడుతుంది. ఆమెని డిస్టర్బ్ చేసినందుకు కోపం వచ్చినా పైకి కనపడకుండా దాచేస్తూ స్లో గా తినడం మొదలు పెట్టింది లోహిత. మధ్య మధ్యలో హర్ష ని చూపులతోనే తినేస్తూ కష్టంగా ముద్ద ను మింగుతూ వుంటుంది. ఈ లోపు హర్ష వాళ్ళు తినడం అయిపోయి వెళ్ళిపోతుంటే గబగబా బాక్స్ లోనే చెయ్యి కడిగేసి ఫ్రెండ్స్ కోసం చూడకుండా హర్ష దగ్గర కి పరిగెత్తింది… హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ముందు కి నడుస్తూ ఉంటే ఆయాసపడుతూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నిల్చుంది. హర్ష ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయోమయంగా చూస్తుంటే …లోహిత హర్ష వైపు మాత్రమే చూస్తూ ” I love you ” అని ఆయాసపడుతూ చెప్పింది. అలా మొఖం మీద చెప్పేస్తుంది అని ఊహించని హర్ష ముందు షాక్ అయినా తర్వాత సారీ అని చెప్పి ముందు కి వెళ్తుంటే …నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు నిన్ను వదలను అని అరుస్తుంది.
లోహిత ను ఒక పిచ్చి దాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు హర్ష. లోహిత కి బాగా కోపం వస్తుంది… ఆమె చిన్నప్పటి నుండి గారం గా పెరిగింది. ఒక్కగానొక్క ఆడపిల్ల అని ఆమె కోరింది ఇవ్వడం చేసేవారు తన పేరెంట్స్ లోహిత కి ఒక అన్నయ్య…( మిగిలిన డీటెయిల్స్ ముందు ముందు తెలుస్తాయి) వాళ్ళ అన్నయ్య హర్ష క్లాస్ మేట్.