కన్నుల్లో నీ రూపం – 1
వైజాగ్
మధ్య తరగతి ఉండే కాలనీ.
ప్రతి ఒక మధ్య తరగతి కుటుంబానికి వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కళ
డబల్ బెడ్రూమ్స్ వాటికి అటాచ్ బాత్రూమ్ ఒక హల్ ఒక కిచెన్ కలిగినా ఒక చిన్నా పొదరిల్లు.
హాల్ లో 25 సంవత్సరాల కుర్రాడు 6 ఫీట్ హైట్ తెలుపు రంగు మెనిమీ చాయ శరీరం,సిల్కే హెయిర్, నవ్వితే బుగ్గన పడే సొట్ట,
డైలీ క్లీన్ షేవ్ చేస్తున్నట్టు ఉన్న బియర్డ్, చూడడానికి అమ్మాయిలా రాజుకుమరుడు లా ఉన్నాడు.
ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు మన స్టోరీ హీరో అభినవ్
హాల్లో లక్కీ చెప్పు రా,కాల్ చేసావ్… ఎంటి విశేషం అని కాల్ ఆన్సర్ చేసాడు అభి
మరేం లేదురా…నాకు జాబ్ వచ్చింది అది నికు చెబుదాం అని కాల్ చేశాను అని చెప్పాడు లక్కీ
వావ్ ఇది నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావురా కంగ్రాట్స్ మొత్తానికి సాధించావ్ అని సంతోషాకరమైన స్వరం తో కంగ్రాట్స్ చెప్పాడు అభి
చాలా థాంక్యూ రా అని చెబుతూ మారి ఇంకేంటి సంగతులు నాకు జాబ్ వచ్చేసింది మారి నీ సంగతేంటి అని అడిగాడు లక్కీ,
చెప్పాను కదా మామ నేను నా గోల్ రీచ్ అవ్వడానికి ట్రే చేస్తున్నా అని, ఆల్రెడీ ఒక బ్యాంకు లో లోన్ కోసం ఆర్చి పెట్టాను అది వస్తే ఇక చిన్నగా స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు అభి
ఒహ్హ్ కూల్ ఐ టూ విష్ యు అల్ ది బెస్ట్ రా… నువ్వు కుడా వీలైనంత త్వరలో సెటిలే అవ్వాలనీ మనసారా కోరుతున్నాను అని చెబుతూ సరే మామ ఇంకా ఉంటాను కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది చెప్పాడు లక్కీ..
చాలా థాంక్స్ రా అని నవ్వుతూ చేప్పి… హా ఓకే సరే రా మారి బై తరువాత కలుద్దాం అని ఫోన్ పెట్టేసి
కిచెన్ లో ఉన్న వాళ్ళ అమ్మని… అమ్మ కాఫీ తీసుకురావా అని కేకలు వేస్తు చెప్పి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు అభి..
సరిగా పది నిమిషాల తర్వాత ఎవరో కాలింగ్ బెల్ కోడుతుంటే అప్పుడే రెడీ అవుతున్న అభి షర్ట్ వేసుకుంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు.
అప్పుడు తన ఎదురుగా…హైట్ ఫైవ్ పాయింట్ వన్, తెల్లని మేనిమి చాయ,చిన్న చిన్న కళ్ళు, ఆ కళ్ళ మధ్యలో చిన్న వైట్ కలర్ స్టోన్ స్టిక్కర్,దాని కింద కుంకుమ, ముక్కుకి ముత్యపు ముక్కు పుడక, లిప్స్టిక్ అవసరంలేని చిన్ని చిన్ని పెదాలు, తన అందాన్ని పెంచే ఓతైన వాలు జడ ,తను వేసుకున్న వైట్ కలర్ చుడీదార్ లో చూడడానికి అచ్చుమ్ ఏంజెల్ లా ఉంది ఆ అమ్మాయి.
ఎదురుగా ఉన్న అమ్మాయిని అలానే కన్ను రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు అభి
అభి అలా చూస్తుంటే తన చిన్న చిన్న కళ్ళతో చూస్తూ చేతిలో ఉన్న కవర్ ని చూపించంది ఆ అమ్మాయి అభికి.
హా కవర్ ని చూసి ఏంటో అర్థం కాక మీరు ఎవరు ..? ఏమ్ కావాలి..?అని అడిగాడు అభి.
అది….. దేవి ఆంటీ గారు ఇల్లేనా ఇది అని అడిగింది ఆ అమ్మాయి.
తన స్వీట్ వాయిస్ కి మైమరచి…హా తను మా అమ్మనే ఇంతకీ మీరెవరో చెప్పండి పిలుస్తాను అని అన్నాడు అభి.
అది నేను కొత్తగా టైలిరింగ్ షాప్ పెట్టాను దాంట్లో మీ అమ్మగారు బ్లౌజెస్ స్టిచ్ చేయమని నాకు ఇచ్చారు వాటిని తీసుకొచ్చాను…. అని సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి.
ఓహ్ అవునా ఉండండి ఒక నిమిషం అమ్మ నీ పిలుస్తాను అని చెప్పి, అమ్మ…. అమ్మ అని కేకలు వేస్తు కిచెన్ లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకోసం ఎవరో వచ్చారు అని చెప్పి
తను బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అమ్మాయినే చూస్తూ అభి.
నా కోసం ఎవరు వచ్చారు రా అని కిచెన్ నుండి బయటికి వస్తుంది అడిగింది దేవి.
ఏమో అమ్మ నాకు తెలియదు నువ్వు బ్లౌజస్ కుట్టమనీ ఎవరికో ఇచ్చావ్ గా వాళ్లు వచ్చారు డోర్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని తన రూంలో నుండి చెప్పాడు అభి.
అభి చేపినట్లు డోర్ దగ్గరికి వెళ్ళి, బయట ఉన్న అమ్మాయి నీ చూసి ఏంటమ్మా ఇలా వచ్చావ్ ఏంటి అని అడిగింది దేవి.
అదే ఆంటీ నిన్న మీరు బ్లౌజెస్ ఇచ్చారు కదా అవి అయిపోయినై వాటిని మీకు ఇద్దామని వచ్చాను అవి ఎలా ఉందొ ఓసారి చూసి చెప్పండి అని చెబుతూ అంది ఆ అమ్మాయి.
అవునా చాలా మంచి పని చేసావ్ అమ్మ నేనే వద్దామనుకున్నాను కానీ ఎండలు చూసావ్ గా ఎంతగా మండుతున్నాయో అందుకే రాలేకపోయాను అందుకే సాయంత్రం వద్దామని ఆగిపోయాను అని చెబుతూ బ్లౌజస్ చూసింది దేవి….
బ్లౌజస్ నీ చూసి నిజంగా చాలా చక్కగా కుట్టావ్ అమ్మ నువ్వు అచ్చమ్ నాకు నచ్చే విదంగా కుట్టావ్ నాకు చాలా బాగా నచ్చింది అని చిరునవ్వు నవ్వుతూ అంది దేవి.
అవునా ఆంటీ చాలా థాంక్స్ ఆంటీ మీకు నచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు అని నవ్వుతూ అంది ఆ అమ్మాయి.
సరే లోపలికి రా అమ్మ వచ్చి ఇలా కూర్చో నేనిప్పుడే డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది దేవి.
దేవి లోపల నుండి డబ్బులు తీసుకువచ్చి ఆ అమ్మాయి కి ఇవ్వడానికి హలో లోకి వచ్చింది..
అదేంటమ్మా కూర్చోమని చెబితే కూర్చోకుండా అక్కడే ఆలా బయట నించునవ్ ఎంటి అని అడుగుతు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది దేవి.
అయ్యో పర్లేదు ఆంటీ నేను బాగానే ఉన్నాను అని చెబుతూ దేవి ఆంటీ ఇస్తున్న డబ్బులు తీసుకొని తన షాప్కి వెళ్లడానికి బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళింది కాస్త దూరం వెళ్ళాక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి. (తనకే తెలియడం లేదు తను ఎందుకు ఆలా చూస్తుందో )
నా కోసమే నా మీరు చూస్తుంది అని నవ్వుతూ అడిగాడు అప్పుడే బైక్ మీద వచ్చినా అభి
లేదు నేను మీ కోసం ఎందుకు చూస్తాను ఆహా అవునా మరి మా ఇంటి నుండి బయటకు వచ్చినా దగ్గిరా నుండి తిరిగి చూస్తున్నారు ఏంటి.
నేను మీ కోసం చూస్తున్నాను అని గ్యారెంటీ ఏంటి అదిగో ఆ కుక్క పిల్ల వెనుక వస్తుంది ఏమో అని చూస్తూ ఉన్నాను
అవునా అని అల్లరిగా ఇంతకీ తమరి పేరు ఏంటి అడిగాడు అభి
నా పేరు ఏందుకు మీకు అని చెప్పి తన నడక పెచ్చి షాప్ లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.
తన షాప్ వెళ్లిపోవడం చూసి క్రేజీ గర్ల్ అనుకోని నవ్వుకుంటూ తన పని మీద భయటకి వెళ్ళిపోయాడు అభి
షాప్ లోకి స్పీడ్ గా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోని తను తాగడం కన్న మీదే పోసుకుంటుంది.
ఆ అమ్మాయి రావడం చూసి జీవన ఏమ్ అయింది తల్లి ఎందుకు కంగారు పడుతున్నావ్.
తన కంగారు నీ తన పిన్ని కి కనిపించకుండా ఏమ్ లేదు భయట ఏండ బాగా ఉంది కదా అందుకే ఇలా అని తన పిన్ని దగ్గిరా నుండి తప్పించుకొని వర్క్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంది జీవ ( మన హీరోయిన్ పేరు జీవన ఇంటిలో వాళ్ళు ముద్దు +షార్ట్ కట్ జీవ అని పిలుస్తారు )
ఇంకా ఉంది.
Swipe left/right or tap the sides to turn pages