చాలా థాంక్స్, వైదేహి!” అంటూ చేతులు జోడించాడు.
“వైదేహి, మీరెలా చేతులు జోడించకండి. నేనేదో చిన్న సహాయం చేశాను, అంతే. మీరు నన్ను మరీ అంత పెద్దదాన్ని చేయకండి. అసలు విషయానికి వస్తే, నేనే మీకు సారీ చెప్పాలి.”
అర్జున్‌కి ఏమి అర్థం కాక అయోమయంగా చూశాడు.
వైదేహి మాట్లాడుతూ, “మీరని తెలియక ఫోన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. రెండుసార్లు ఫోన్ ఎత్తకపోయేసరికి కోపం వచ్చింది. దాంతో మిమ్మల్ని తిట్టాను. నన్ను క్షమించండి, సార్!” అని అడిగింది.
అర్జున్ అభిమన్యు వైపు చూశాడు. అభిమన్యు ఏమీ మాట్లాడకుండా వైదేహిని మాత్రమే చూస్తూ ఉన్నాడు.
“నువ్వు తిట్టింది నన్ను కాదు, వైదేహి. అభిమన్యుని!” అని చెప్పగానే వైదేహికి చాలా ఇంకా భయంగా ఉంటుంది.
అభిమన్యు గురించి కౌశిక్ చెప్పడంతో కావ్యకు, వైదేహికి చాలా భయం వేసింది.