అప్పటికే వైదేహి హైదరాబాద్ వెళ్లి ఆరు నెలలు గడిచిపోయాయి.
సీతమ్మ గారు, రాఘవయ్య గారు వైదేహికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
ఒకరోజు పంతులుగారు రాఘవయ్య గారి దగ్గరికి వచ్చి, “ఒక సంబంధం ఉంది. మంచి కుటుంబం, ఆస్తిపరులు. అబ్బాయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు” అంటూ ఒక ఫోటో రాఘవయ్య గారికి ఇస్తారు.
రాఘవయ్య గారు, సీతమ్మ గారు ఆ ఫోటో చూసి, అబ్బాయి వైదేహికి ఈడు జోడుగా బాగుండడంతో సంబంధం ఖాయం చేసుకోవాలి అనుకుంటారు.
“ఈ విషయం గురించి మీకు తర్వాత చెబుతాము” అని పంతులుగారితో చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతారు.
సీతమ్మ గారు మాట్లాడుతూ, “అబ్బాయి గురించి మీరు కూడా ఎవరైనా అడిగి తెలుసుకోండి” అని రాఘవయ్య గారితో చెబుతారు.
రాఘవయ్య గారు సరే అని అక్కడి నుంచి కావ్య వాళ్ల ఇంటికి వెళ్తారు.
కావ్య వాళ్ల నాన్నతో మాట్లాడుతూ, “వైదేహికి సంబంధం ఖాయం చేసుకోవాలి అనుకుంటున్నాము. అబ్బాయి గురించి, వాళ్ల ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. మీకు ఎవరైనా తెలిస్తే ఎంక్వయిరీ చేయండి” అని రాఘవయ్య గారు కావ్య వాళ్ల నాన్నతో చెబుతారు.