“రేపొద్దున నేను బిజీగా ఉంటే పెళ్లిచూపుల టైంలో ఇక్కడ ఉండలేను మీరే చూసుకోండి అన్ని, ఒకవేళ బిజీ లేకపోతే ఉంటాను.” అని అన్నాడు చిరునవ్వుతో శౌర్య.
“సరే రా..” అని అన్నాడు రఘురామయ్య.
“ఒక బిడ్డ చావు అంచుల వరకు వెళ్ళొచ్చి కనీసం గంటలు కూడా తిరగలేదు అప్పుడే ఈ ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడుతున్నారా…! అయినా పురుడు అయ్యే వరకు ఏలాంటి శుభకార్యం చేయకూడదు అని మర్చిపోయారా కౌసల్య..?
అయినా ఇవి అన్ని నీకు ఎలా తెలుస్తాయిలే మీ అత్తగారు అన్ని పద్ధతిగా చెప్తేగా..! అయినా మీ అత్తగారికే పద్ధతి లేదు మీకేం చెప్తుందిలే.” అని అంది అకస్సు వెలగక్కుతు సాంబశివరావు తల్లి.