స్నేహ సైలెంట్ గా ఉండి తల కిందకు దించి ఎం కాలేదు అని తల అడ్డంగా ఊపింది.
కావ్య కి ఎందుకో అనుమానగా ఉంది. ఎందుకంటే లిఫ్ట్ లో వెళ్లెవరకూ బాగానే ఉంది… లిఫ్ట్ నుంచి వచ్చాక ఇలా అయింది అని.. లిఫ్ట్ లో ఏదో జరిగింది అని అర్ధం అయింది కావ్య కి.
ఏంటి చెప్పు ఎం జరిగింది అని సీరియస్ గా అ డుగుతుంది కావ్య.
ఎం లేదు అనే చెబుతుంది స్నేహ.
నీ పని ఇలా కాదు.. చెప్తా అగు అని పెద్ద అన్నయ్య అని గట్టిగ పిలుస్తుంది కావ్య.
ఆలా పిలవగానే స్నేహ భయం తో వద్దు… వద్దు.. చెప్తాను సైలెంట్ గా ఉండు అని కావ్య నోరు మూసి అంటుంది స్నేహ.