New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 2

నువ్వు నా సొంతం – 2

స్నేహ కి అగనంటూ కన్నీళ్లు వస్తుంటే.. వాష్రూమ్ కి వెళ్లి తన బాధని మొత్తం తీర్చుకొని మళ్ళీ లాప్టాప్ ముందు వచి కూర్చొని తన వర్క్ ని కంటిన్యూ చేస్తుంది స్నేహ.

 

 

ఆర్యన్ 9కి లేచి ఫ్రెషప్ ఐ కిందకు వచి సోఫా లో కూర్చున్నాడు.

 

ఆర్యన్ వల్ల లక్ష్మి గారు ఆర్యన్ దగ్గరకు వచి అమ్మా ఏంటి నాన్న డల్ గా ఉన్నావు…అని అడుగుతుంది ఆవిడా.

 

ఎం లేదు మామ్ … కావ్య గురించి బాధగా ఉంది.. తాను ఇప్పుడు ఎలా ఉంది మామ్ అని అడుగుతాడు ఆర్యన్.

 

లేదు నాన్న అస్సలు బాగా లేదు… ఇంకా డాక్టర్స్ అయితే ఎప్పుడు ఎం అవుతుందో చెప్పలేము అని చెప్పరు అని చెప్తుంది లక్ష్మి గారు.

 

అసలు దీని అంతటికి కారణం ఆ స్నేహ…. నా కావ్య ఇలా చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం… దాన్ని అస్సలు వదలను అని అంటాడు ఆర్యన్.

 

జరిగిపోయింది కదా నాన్న.. ఇప్పుడు మనం ఎం చేదాం అని అంటుంది లక్ష్మి గారు.

 

ఎం చేయలేము కానీ.. దానికి తగిన శిక్ష అయితే వేయొచ్చు కదా అని లేచి ఆఫీస్ కి వెళ్తున్న మామ్ అని అంటాడు ఆర్యన్.

 

టిఫిన్ చేసి వేళ్ళు నాన్న అని అంటారు ఆవిడా.

 

లేదు మామ్ నేను వెళ్ళాలి అని తన కార్ లో ఆఫీస్ కి వెళ్ళిపోతాడు ఆర్యన్.

 

లక్ష్మి గారు బాధ గా సోఫా లో కూర్చొని ఆలోచిస్తావుంటారు.

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

ఆర్యన్ ఆఫీస్ కి వెళ్ళాడు…

 

కోపం అసహనం, బాధ ఎన్ని కలగాలిపి ఆఫీస్లో కార్ దిగుతాడు ఆర్యన్.

 

కోపంగా తన ఫ్లోర్ కి వెళ్ళిపోయాడు ఆర్యన్.

 

వర్క్ ఎం చేయాలి అని అనిపించక అలానే తన సీట్ లో కూర్చొని ఉన్నాడు ఆర్యన్.

 

అప్పుడే అక్కడకు తన తమ్ముడు అయినా హర్ష ఒక ఫైల్ పట్టుకొని ఆర్యన్ కేబిన్ కి వస్తాడు.

 

హర్ష ని చూసి వాట్ అని అంటాడు ఆర్యన్.

 

అన్నయ్య ఈ ఫైల్ లో నీ సిగ్నచర్ కావాలి అని ఫైల్ ఆర్యన్ ముందు పెడ్తాడు హర్ష.

 

ఆర్యన్ ఆ ఫైల్ లో సైన్ చేసి… వాడు ఎం అంటున్నాడు.. నిజం చెప్పాడా అని కోపంగా అడుగుతాడు ఆర్యన్.

 

లేదు అన్నయ్య… వాడు నాకు ఎం తెలీదు అనే చెప్తున్నాడు… కావ్య ని వాడు లవ్ చేయలేదు అంట అన్నయ్య… కావ్య నే లవ్ చేసింది అంట… కావ్య ప్రపోస్ చేస్తే వీడు నో అని చెప్పాడు అంట… అందుకే కావ్య సూసైడ్ చేసుకుంది అంట అన్నయ్య అని చెప్పాడు హర్ష.

 

లేదు కావ్య నాకు చెప్పింది వీడే లవ్ చేసాడు వెంట పడ్డాడు అని… మరి వీడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని కోపంగా అంటాడు ఆర్యన్.

 

ఇది అంత కాదు అన్నయ్య… కావ్య కి బాగు ఐయ్యాక ఎన్ని నిజాలు తెలుసుకుందాం… అప్పటి వరకు వీడు బతకాలి అంతే… అప్పుడు నిజం తెలుస్తుంది… ఎవరికీ శిక్ష వేయాలి అని అంటాడు హర్ష.

 

ఓకే కానీ వాడు తప్పించుకోవడానికి అస్సలు వీలు లేదు…

 

దాన్ని… వీడిని అస్సలు వదిలి పెట్టాను… నా కావ్య బతికి ఉన్నంత వరకే ఈ భూమి మీద ఉంటారు వీళ్ళు… నా కావ్య కి ఏమైనా కావాలి… అప్పుడు తెలుస్తది వాళ్లకు నరకం అంతే ఏంటో అని అంటాడు ఆర్యన్.

 

ఓకే అన్నయ్య కూల్… కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని హర్ష బయటకు వెళ్ళిపోతాడు.

 

ఆర్యన్ తన కేబిన్ లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు… కోపం తట్టుకోలేక..

 

వెంటనే తన లాప్టాప్ కి కనెక్షన్ ఉన్న సీసీ కెమెరా లో స్నేహ ని చూస్తున్నాడు ఆర్యన్.

 

తన ప్రశాంతగా వర్క్ చేసుకుంటుంది.

 

ఆర్యన్ కి కోపం ఎక్కువై.. నా కావ్య ని మోసం చేసి నువ్వు హ్యాపీగా ఉంటావా… నేను అస్సలు ఉండనివ్వను అని కోపంగా అంటాడు ఆర్యన్.

 

వెంటనే ప్యూన్ ని పిలిచి స్నేహ ని తన కేబిన్ కి రమ్మని చెప్పు అని చెప్పాడు ఆర్యన్.

 

ఓకే సార్ అని ప్యూన్ వెళ్ళిపోయాడు…

 

లాప్టాప్ లో స్నేహ ని చూస్తూ… ఎంత అందంగా ఉన్నవే… అందుకే ఆ అందాన్ని చూపించి అందరిని నీ వెనుక తీపించుకుంటావుగా…

 

ఈ 3 నెలలు నరకం అంతే ఏంటో చూసావు…

 

కానీ నా కావ్య కి కి ఏమైనా కావాలి.. నీకు చావు రుచి చూపిస్త అని అనుకుంటాడు ఆర్యన్.

 

ప్యూన్ స్నేహ దగ్గరకు వెళ్లి.. మేడం మిమ్మల్ని సార్ రమ్మని చెప్తున్నాడు అని.. ఆ సార్ కేబిన్ కి రావాలి అంట అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్.

 

స్నేహ కి మళ్ళీ టెన్షన్ మొదలింది…

 

సార్ ఎందుకు రమ్మన్నాడు అని…

 

ఏవో ఏవో ఆలోచనల నడుమ స్టెప్స్ ఎక్కుతుంది…

 

ఆలా టాప్ ఫ్లోర్ కి వెళ్లి కేబిన్ డోర్ దగ్గర నిలబడి తన భయాన్ని.. కంట్రోల్ చేసుకుంటుంది.

 

సార్ ఎందుకు పిలిచారో తేలిక భయంగా అక్కడే నిలబడింది.

 

తన చేతులు వణుకుతుంటే… టెన్షన్ ఎక్కువై… చెమటలు పడుతుంటే… పక్కనే ఉన్న వాటర్ కొన్ని తాగి.. తన టెన్షన్ ని కంట్రోల్ చేసుకొని డోర్ నాక్ చేసింది స్నేహ..

 

కానీ అటు వైపు నుంచి ఎటువంటి సమాధానం రాదు..

 

మళ్ళీ డోర్ నాక్ చేసింది…అయినా కూడా ఎటువంటి సమాధానం రాదు.

 

పోనీ లోపలకు వెళదామా అంతే పర్మిషన్ లేకుండా లోపలకు వెళ్తే అంతే…

 

ఎం చేయాలో తేలిక మళ్ళీ డోర్ నాక్ చేసింది స్నేహ..

 

ఇప్పుడు అటు వైపు నుంచి కమింగ్ అన్న పిలుపు చాలా బేస్ వాయిస్ లో వస్తది.

 

ఆ గొంతుకు బయపడి..చిన్నగా డోర్ తీసుకొని లోపలకు వెళ్తుంది స్నేహ..

 

మరి ఆర్యన్ స్నేహ ని ఎందుకు పిలిచాడో…

అసలు కావ్య ఎవరు…

అసలు కావ్య కి స్నేహ కి ఏమిటి సంబంధం..

Any one guess….

 

కొనసాగుతుంది….

 

ఇది నా కొత్త స్టోరీ….. ఎలా ఉందొ కామెంట్ లో చెప్పండి గయ్స్…. అలాగే నా స్టోరీస్ నచ్చితే నన్ను ఫాలో చేయండి…. ఇంకా నా దగ్గర మీకు నచ్చినట్టు స్టోరీస్ చాలానే ఉన్నాయ్…