నువ్వు నా సొంతం – 4
ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు హర్ష.
ఇంకా ఎం కావాలి రా… అది చేసిన మోసానికి నాకు ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉంది అని తన గుండె దగ్గర వేలితో పొడుచుకుంటూ అంటున్నాడు ఆర్యన్.
నువ్వు టెన్షన్ తీసుకోకు అన్నయ్య… ముందు నువ్వు కూల్ అవ్వు అని చిన్నగా చెప్తాడు హర్ష.
లేదు రా నేను అస్సలు నార్మల్ గా లేను… నా వల్ల అస్సలు కావడం లేదు నేను అసలు ఇలా ఎలా మోసపోయా అని గట్టిగ అరుస్తున్నాడు ఆర్యన్.
అన్నయ్య కూల్ కూల్…. నీకు ఒక విషయం చెపుదామని వచ్చాను అని అంటాడు హర్ష.
అన్నయ్య కావ్య కి సృహ వచ్చింది అంట అన్నయ్య అని అంటాడు హర్ష.
ఆ మాట వినగానే ఆర్యన్ కి కోపం మొత్తం తగ్గిపోయి… హ్యాపీ నెస్ అనేది వచ్చేసింది ఆర్యన్ కి.
అవునా తొందరగా హాస్పిటల్ కి పద అని అంటాడు ఆర్యన్.
సరే అన్నయ్య అని ఇద్దరు కార్ లో హాస్పిటల్ కి వెళ్తారు.
కావ్య స్పృహ వచ్చింది అన్న ఆనందములో హాస్పిటల్ కి చేరుకున్నారు ఇద్దరు.
ఆలా ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లి కావ్య ఉన్న రూమ్ కి వెళ్లారు ఇద్దరు.
అప్పటికే వల్ల ఇంట్లో వాళ్ళు అందరూ కావ్య చుట్టూ ఉండి ఏదో ఏదో మాట్లాడుతున్నారు.. కానీ కావ్య అయితే చుట్టూ దిక్కులు చూస్తూ ఉంది.
ఆర్యన్ కావ్య దగ్గరకు వెళ్లి… కావ్య చేతిని పట్టుకొని… కావ్య ఎలా ఉంది రా… ఫీలింగ్ బెటర్ అని అడుగుతాడు బాధగా ఆర్యన్.
కావ్య సైలెంట్ గా ఉంటుంది. ఎవ్వరిని కూడా చూడకుండా దిక్కులు చూస్తుంది.
ఆర్యన్ కి అయితే బాధ గా ఉంది కావ్య ని ఆలా చూసి…
హర్ష ఆర్యన్ భుజం పై చేతిని వేసి… ఎం కాదులే అన్నయ్య.. నువ్వు బాధ పడకు అని చిన్నగా అంటాడు హర్ష.
అప్పుడే డాక్టర్ ఆ రూమ్ కి వస్తాడు…
ఆర్యన్ డాక్టర్ దగ్గరకు వెళ్లి నా చెల్లికి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతాడు ఆర్యన్.
డాక్టర్ : చుడండి ఆర్యన్ గారు… మీ చెల్లి తల కి బలమైన దెబ్బ తగలడం వల్ల… మెదడుకు చాలా గట్టి దెబ్బ తగిలింది… తాను అస్సలు బతకాదు అనుకున్నాము..
కానీ మా ఆలోచన మొత్తం తల కింద్దులు చేసి తాను బతికింది… ఇప్పుడు తనకి స్పృహ కూడా వచ్చింది…
కానీ ఇప్పుడు తాను ఎం గుర్తుపట్టే సిట్యుయేషన్ లో లేదు… తనకి కొంచెం టైం కావాలి… ఇంకా కొన్ని వారాలలో మీ చెల్లి ఇంతకముందు కావ్య ల మీ ముందు ఉంటుంది అని చెప్పాడు డాక్టర్.
ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరూ హ్యాపీ గా ఫీల్ ఐయ్యారు.. ముఖ్యంగా ఆర్యన్ అయితే హ్యాపీ నెస్ కి అవధులు లేవు…
ఆలా ఆర్యన్ తన చెల్లి తో కొంచెం సేపు మాట్లాడి… మళ్ళీ ఆఫీస్ కి వచ్చాడు ఆర్యన్.
ఆఫీస్ కి రాగానే అక్కడ వస్తువులను చూసి తన కోపాన్నికి ఆ వస్తువులు అన్ని బలి ఐయ్యాయి అని అనుకోని… స్నేహ గుర్తుకు వచి… తన పర్సనల్ రూమ్ కి వెళ్తాడు ఆర్యన్.
స్నేహ ఇంతక ముందు ఎలా అయితే పడుకొని ఉందొ అలానే స్పృహ లేకుండా పడుకొని ఉంది స్నేహ.
ఆర్యన్ మనసు కలక్కుమాంది స్నేహ ని ఆలా చూసి…
ఎందుకే… ఎందుకే.. నువ్వు ఇలా ఐపోయావు… నిన్ను నేను ఎంతలా ప్రేమించాను… నువ్వు కూడా నన్ను ప్రేమించావు అనుకున్న.. కానీ నన్ను ప్రేమించకుండా నా డబ్బును ప్రేమించావు…
నిన్ను మహారాణి లాగా చూసుకుందాం అనుకున్న…
కానీ నువ్వు నన్ను మోసం చేసావు…
నా చెల్లి లైఫ్ ని ఆగం చేసావు…
ఎందుకే ఎందుకు ఆలా చేసావు అని అక్కడ ఉండలేక మళ్ళీ తన కేబిన్ కి వచి లేడీ డాక్టర్ కి ఫోన్ చేసాడు ఆర్యన్.
తరువాత ప్యూన్ తో రూమ్ మొత్తం క్లీన్ చేపించి..
మళ్ళీ చేయిర్ లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు ఆర్యన్.
ఆ కనుల స్నేహ అందమైన నవ్వు.. తన అమాయకత్వం.. తన అల్లరి.. అని గుర్తుకు వస్తుంటే… ఆర్యన్ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఆర్యన్ కళ్ళు తెరిచి… నేను ఏమైనా తప్పు చేస్తున్నాన్న.. స్నేహ విషయం లో…
నేను స్నేహ ని అంతలా ప్రేమించాను కదా… మరి తన గురించి అన్ని తెలిసిన నాకు… తాను మోసం చేసింది అంటే నేను ఎలా నమ్ముతున్నాను…అని ఆర్యన్ అనుకుంటున్నాడు.
మళ్ళీ వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా… లేదు తాను మోసము చేసింది… తన వల్ల ఒక ప్రాణం విలవిలాలాడుతుంది అని అనుకుని మళ్ళీ తన మనసును రాయి గా మార్చుకుంటున్నాడు ఆర్యన్.
అప్పుడే తన రూమ్ డోర్ ని ఎవరో నాక్ చేస్తుంటే… ఆలోచన నుంచి బయటకు వచి.. కమింగ్ అన్నాడు ఆర్యన్.
ఒక లేడీ డాక్టర్ రూమ్ లో కి వచి చెప్పండి సార్ పిలిచారు అన్నారు ఆవిడా.
ఆర్యన్ ఆవిడని తన పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్తాడు ఆర్యన్.
ఆవిడకు స్నేహ ని చూడగానే విషయం అర్ధం ఐ… ఓకే సార్ నేను చెక్ చేస్తాను.. మీరు బయటకు వెళ్ళండి అని ఆర్యన్ ని బయటకు పంపించారు ఆవిడా.
ఆర్యన్ ఎందుకో కానీ స్నేహ ని చూస్తుంటే బాధగా అనిపించి రూమ్ బయటకు వచి సోఫా లో కూర్చున్నాడు…
తన ఆలోచనలు అన్ని ఒక 6 నెలల ముందుకు వెళ్తున్నాయి…
స్నేహ ని చుసిన రోజు ఆర్యన్ మర్చిపోని రోజు… తన అందం.. తన అమాయకత్వం… తన పెద్ద పెద్ద కళ్ళు… ముఖ్యంగా తాను నవ్వితే బుగ్గన పడే సొట్ట.. తన అందానికి మెయిన్ పాయింట్…
ఆలా ఆర్యన్ తన గతానికి వెళ్ళాడు…
కొనసాగుతుంది….
నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కూడా ఆ గతం ఏంటో తెలుసుకుందామా…
తెలుసుకోవాలి అంటే నాకు ఇంకా ఫాలోయర్స్ కావాలి….
ఆ గతం ఏంటో తెలుసుకోవాలి అంటే నాకు ఇంకా ఎక్కువ కామెంట్స్ కావాలి ఫ్రెండ్స్….
ప్లీజ్….
కొంచెం ఫాలో చేయొచ్చు కదా బంగారాలు….
ప్లీజ్…. 🥰
ఇది నా కొత్త స్టోరీ….. ఎలా ఉందొ కామెంట్ లో చెప్పండి గయ్స్…. అలాగే నా స్టోరీస్ నచ్చితే నన్ను ఫాలో చేయండి…. ఇంకా నా దగ్గర మీకు నచ్చినట్టు స్టోరీస్ చాలానే ఉన్నాయ్…
Swipe left/right or tap the sides to turn pages