New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పంచమ వేదం – 1

పంచమ వేదం – 1

 

ఇది కేవలం ఒక కల్పిత కథ…. సో రీడ్ అండ్ ఎంజాయ్…. 

 

 

ఒకప్పుడు బ్రహ్మ కి ఐదు తలలు ఉండేవి అంట… కానీ,, ఒకనాడు పరమేశ్వరుడికి కోపం వచ్చి ఒక తలని నరికేశారు… కానీ,, అంతకు ముందే బ్రహ్మ తల నుండి వేదాలు ఉద్భవించాయి అని చెప్తారు…. ఆయన నాలుగు తలలు నుండి నాలుగు వేదాలు పుట్టాయి…. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం….. అలా ఐదో తల నుండి ఒక వేదం పుట్టింది… కానీ క్రమంగా,, ఐదో తల తెగి పడడం తో… ఆ ఐదో వేదం కూడా పడిపోయింది… రుద్రవరం అనే ఒక ఊరులో ఆ ఐదో తల కి సంబంధించిన గుడి ఆ ఐదో వేదం కూడా అక్కడే ఉంది అని అందరూ అంటారు…. మరి ఇప్పుడు అయిన ఆ ఐదో వేదం బయటకి వస్తుంది ఆ?? ఎవరు బయటకు తీస్తారు?? ఆది బయటకి ఎప్పుడూ వస్తుందా అని గుడి కూడా ఎదురు చూస్తుంది… ఆ గుడి తో పాటు కాలం కూడా ఎదురు చూస్తుంది…. మరి మనం కూడా చూద్దామా ఆ వేదం ఎప్పుడూ, ఎలా బయటకు వస్తుంది అని…. ఎవరు తీస్తారు అని.!!!!

 

 

……………………

 

ప్రస్తుత కథ….

 

 

హైదరాబాద్ లోని ఒక ఏరియా లో…… సాయి అపార్ట్మెంట్స్…. ఫ్లాట్ నెంబర్.. 505 లో… ఆగకుండా అలారం మోగుతుంది….

 

 

రేయ్,, ఎవరి ఫోన్ రా అది??.. ఆపండి రా బాబు చెవులు పగిలిపోతున్నాయి రా…. అని అంటాడు వంశీ దుప్పటి మొహం మీద కి లాగుకుంటూ….. 

 

 

అభి (అభినవ్) ఆ ఫోన్ ఆపు రా అంటాడు సింహ… అభి మీద చెయ్యి వేసి….

 

 

రేయ్ రుద్ర సింహ,, చెయ్యి తీయి రా బాబు చిరాకు గా… నా మీద వేస్తావు ఏంటి?? నేను ఏం అయిన నీ పెళ్ళాని అనుకున్నావా ఏంటి??

 

 

 మీ గోల ఆపండి రా… ముందు అలారం ఆపండి రా.. నిద్ర వస్తుంది అని అంటాడు వంశీ…

 

 

అబ్బా,, వీళ్ళు లేవరు… నన్ను పడుకొనివ్వారు అని అరవింద్ లేసి ఆ అలారం ఆపి మళ్ళీ పడుకున్నాడు…. 

 

 

రేయ్,, అరవింద్ నువ్వు రా నా ఫ్రెండ్ వి… అని మళ్ళీ నిద్రపోతాడు వంశీ….

 

 

లేవండి రా… మీకు ఆఫీసు కి టైమ్ అవ్వడం లేదు అని అందరి మీద నీళ్లు కొడతాడు ధ్రువ…

 

 

వంశీ, ఈరోజు టిఫిన్ చేయాల్సిన డ్యూటీ నీదే అంటాడు ధ్రువ….

 

 

ఈరోజు చేయడం ఏంటి రా?? రోజు చేసే కదా వెళ్తున్న…

 

 

చేయడం అంటే తినడం కాదు రా బాబు… వండాలి… లేచి వండు…

 

 

ఈరోజు, అరవింద్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని కోరుకుంటున్నరూ మా ఇంటి సభ్యులు…

 

 

రేయ్, కోర్టు లో కేసు వేస్తా నీ పైన నన్ను కానీ వండు అన్నావు అంటే!! 

 

 

ఎంత నువ్వు జూనియర్ లాయర్ అయినంత మాత్రం… బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటే కేసు వేస్తావా??

 

 

అరవింద్ – కోర్టు లో జూనియర్ లాయర్….

 

 

వంశీ – ప్రెస్ లో న్యూస్ రీడర్… 

 

 

మార్నింగ్ ఏ ఫోన్ చూస్తూ వుంటాడు సింహ…

 

 

ఏంటి రా ఇంత పొద్దునే ఫోన్ చూస్తున్నావ్?? అంటాడు ధ్రువ…

 

 

కోడింగ్ తో చస్తున్నా రా బాబు…. ఈ కోడింగ్ చేయలేకపోతున్న రా అంటాడు సింహ….

 

 

కోడి కూర తిను రా కోడింగ్ వస్తుంది అంటాడు వంశీ…

 

 

నీకు కామెడీ ఐపోయింది రా అని అభి పక్కన వున్న దిండు తీసి వంశీ మీద విసిరేస్తాడు….

 

 

మీరు ఇద్దరు లేచి రెడీ అవ్వండి రా… లాగిన్ చేయాలి కదా అంటాడు అరవింద్…

 

 

సింహ ఇంకా అభినవ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్….

 

 

ధ్రువ నీకు హాస్పిటల్ కి టైమ్ అవుతుంది రా వెళ్ళు…

 

 

ధ్రువ – డాక్టర్….

 

 

అలా అందరూ రెడీ అయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు…..

 

…………….

 

ఈ కోడింగ్ చేయడం కంటే ఇంట్లో పనులు చేసుకోడం నయం రా బాబు అని అనుకుంటాడు అభి….

 

 

సింహ: ఏంటి రా ఇంట్లో పనులు అంత ఈజీ నా…

 

 

అభి: అంతే కదా రా… నేను ఇంట్లో పనులు చూసుకుంటా… మీరు నలుగురు జాబ్ చేసి రండి… ఇంట్లో నేను మీకు ఫుడ్ వండి పెట్టీ… పనులు చేసుకుంటూ చిల్ అవుత…. 

 

 

సింహ: మరి పెళ్ళి?? ఇంట్లో పనులు చేసుకునే వాడికి పిల్ల నీ ఎవరు ఇస్తారు అయితే??

 

 

ఈ జీవితానికి పెళ్ళి వద్దు.. ఏం వద్దు… ఇలాగే,, సింగిల్ గా ఉండిపోత అంటాడు…

 

 

రేయ్,, ఆ అమ్మాయి బాగుంది కదా అంటాడు సింహ…

 

 

ఆమెనీ చూడడం ఆపి… ముందు పని చెయ్యి… ఈరోజు టాస్క్ డెడ్ లైన్… ఆ మ్యానేజర్ గాడు మన  ఇద్దరినీ చూస్తున్నాడు చూడు… ఈరోజు ఆ టాస్క్ అవ్వకపోతే చంపేసేలా చూస్తున్నాడు… 

 

 

ఎటూ అయిన వెళ్ళిపోవాలి అని ఉంది అభి… ఈ వర్క్ చేయడం నా వల్ల కావడం లేదు….

 

 

ప్రాజెక్ట్ అవ్వని రా… లాంగ్ లీవ్ తీసుకుందాం…

 

 

To be continued……..