New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పంచమ వేదం – 4

పంచమ వేదం – 4

పంచమ వేదం -4

 

 

రేయ్,, అది బ్యాగ్ ఆ ఇంకా ఏం అయిననా?? అంత ఉంది ఏంటి రా ఏదో కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి అత్తారింటికి వెళ్తున్నట్టు అన్ని సర్దుతున్నావు ఏంటి రా అరవింద్?? అంటాడు సింహ 

 

 

ఓహ్ అదా… నా బుక్స్ రా…. అవసరం కదా అని….

 

 

రేయ్,, వంశీ… నీ బ్యాగ్ ఏంటి రా అంత కాలిగా ఉంది?? అసలు ఏం పెట్టుకున్నావా లేదా?? అంటాడు సింహ…

 

 

 

ఎందుకు రా… అనవసరం గా లగేజ్… టవల్ నిధి వాడుకుంట… పెర్ఫ్యూమ్ అరవింద్… ఇంకా సోప్ అంటావా!! స్నానం చెయ్యని వాడికి సోప్ తో పని ఏంటి?? అయిన అప్పుడు అప్పుడు చేయాలి కదా అప్పుడు ఆ అభి గాడి సోప్ వాడతా…. ఇంకా ఫైనల్లీ వాచ్ ధ్రువ ది… అని అంటూ ధ్రువ వాచ్ తీసుకొని చేతికి పెట్టుకుంటాడు… ఇంకా నేను ఒక 2 షర్ట్స్ పాంట్స్ పెట్టుకున్న అంతే ఈ వంశీ గాడు సింపుల్ అంతే….

 

 

ఆ బట్టలు కూడా ఎందుకు మావే వేసుకో రా అంటాడు ధ్రువ…

 

 

సారీ,, నాకు పక్కన వాళ్ళ బట్టలు వేసుకోడం అలవాటు లేదు లే….

 

 

ఉంటే అవి కూడా వదలవు రా నువ్వు అంటాడు అభి…

 

 

ఫ్రెండ్స్ ఉండేదే అందుకే కదా!!

 

 

ఎందుకు??

 

 

హెల్ప్ చేయడానికి…

 

 

 

అయిన దిన్ని హెల్ప్ అనరు… వాడుకోవడం అంటారు…. అంటాడు అభి….

 

 

కమ్ ఆన్ రా చిల్…. పదండి వెళ్దాం స్టేషన్ కి అంటాడు వంశీ….

 

 

వీడు తో వేగడం కష్టం రా బాబు అనుకుంటాడు అరవింద్….

 

 

ట్రైన్ లో…..

 

రేయ్ విండో సీటు నాకు ఇవ్వు అంటాడు వంశీ…

 

 

తీస్కో రా బాబు… రా రా నువ్వే కూర్చో అని వంశీ నీ తీస్తాడు అభి….

 

 

అలా వంశీ,, అరవింద్,, ధ్రువ ఒక పక్క…. వాళ్ళకి ఎదురు గా సింహ ఇంకా అభినవ్….

 

 

వంశీ: అబ్బా,, విండో సీటు ఫోటోస్ బాగా వస్తాయి అని ఫోన్ తీస్తూ ఉంటే…

 

 

విండో సీటు ఉంటే కాదు రా…. మొహం బాగుంటే వస్తాయి ఫొటోలు అంటాడు సింహ… దానికి మిగతా వాళ్ళు నవ్వుతున్నారు…

 

 

రేయ్,, నవ్వింది చాలు… మీరు ఏమి టూత్ పేస్ట్ కి ప్రమోషన్ చేయడం లేదు… నోరుమూసుకుని కూర్చోండి అంటాడు వంశీ కోపం గా….

 

 

సరే లే… కూల్…. అంటాడు అరవింద్…

 

 

రేయ్ అభి… మీ ఊరి లో స్పెషల్ ఏంటి?? అంటాడు సింహ…

 

 

గ్రామ సింహ లు అంటాడు వంశీ… సింహ వాడి వైపు చూస్తాడు… 

 

 

నన్ను అంటున్నావు కదా రా నువ్వు??

 

 

నువ్వు కుక్క వి ఆ?? అంటాడు వంశీ….

 

 

రేయ్,, గొడవలు ఆపి కూర్చోండి…. ప్రశాంతం గా… అంటాడు ధ్రువ….

 

 

రేయ్,, టికెట్స్ ఎక్కడ ఉన్నాయి?? టీసీ వస్తున్నారు?? అంటాడు వంశీ…

 

 

ఓహ్ షిట్… అని తల పట్టుకుంటాడు సింహ…

 

 

ఏంటి రా??

 

 

అది… అది… వంశీ కి టికెట్ తియ్యడం మర్చిపోయా…. డబ్బులు 4 టికెట్స్ కి ఉన్నాయి అని ఫస్ట్ 4 చేశా… వంశీ ది మర్చిపోయా!!!

 

 

రేయ్,, సచ్చినోడ… నేను ఏం చేశాను రా నీకు?? ఎదవ…. నా టికెట్ ఏ మర్చిపోయావా నువ్వు?? 

 

 

రేయ్,, వెళ్ళి వాష్ రూమ్ లో ఉండు…. 

 

 

ఛీ… నోరు మూసుకో రా…. అని వంశీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు….

 

 

 

సింహ నిజం గా టికెట్ తియ్యలేదా నువ్వు వాడికి?? అని అడుగుతాడు అభి..

 

 

తీసాను రా…. సరదాగా ఏడిపించాలి అని అలా చెప్పా…

 

 

టీసీ వచ్చి… అందరి టికెట్స్ అడిగి చెక్ చేసుకున్నాక….

 

 

సింహ: సార్,, వంశీ అని మా ఫ్రెండ్ వాష్ రూమ్ లో ఉన్నాడు… వాడి నీ కూడా చెక్ చేయండి… ఇది వాడి టికెట్…

 

 

సింహ వెళ్ళి వాష్ రూమ్ తలుపు తడ్తాడు… 

 

 

లోపల వంశీ… అమ్మో ఎవడో వచ్చాడు… నా పని ఫినిష్ అనుకుంటాడు…

 

 

వంశీ: ఏంటి రా??

 

 

టీసీ పిలుస్తున్నారు నిన్ను…

 

 

ఎందుకు??

 

 

టికెట్ లేదు అని…

 

 

ఎవడు రా చెప్పింది…

 

 

నేనే నోరు జార…

 

 

రేయ్,, పనికి మలినోడ…. నన్ను చంపడానికి పుట్టవ రా నువ్వు… అంటాడు వంశీ..

 

 

టీసీ వంశీ చూస్తూ ఉంటే…

 

 

వంశీ: సార్,, వీడే నా టికెట్ తియ్యలేదు… నా తప్పు ఏం లేదు సార్….

 

 

హలో,, ఇక్కడే ఉంది గా నీ టికెట్… అని టీసీ చూపించి అక్కడ నుండి వెళ్లిపోగానే…

 

 

సింహ… నిన్ను అని బ్యాగ్ తో కొడతాడు వంశీ వాడిని…

 

 

రేయ్,, ఆపు…. ఏదో సరదాగా చేశా…

 

 

దీన్ని సరదా అనరు…. దూల అంటారు… దూల నా కోడకా…..

 

 

సరే,, సరే… కూర్చోండి ఇద్దరు… అంటాడు ధ్రువ….

 

 

వంశీ ఆపు… సింహ ఇంకా చాలు ఎక్కువ అయింది… అంటాడు అరవింద్…

 

 

ఓకే…. సారీ రా వంశీ… అంటాడు సింహ…

 

 

ఏడ్చావ్ పో…

 

 

To be continued……